Hyderabad : హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ పదే పదే చెబుతూ ఉంటారు. ఇప్పుడు నిజంగానే విశ్వనగరాల జాబితాలో హైదరాబాద్ చేరిపోయింది.
ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితాలో భాగ్యనగరానికి 65వ స్థానం దక్కింది. నగరంలో 11,100 మంది మిలియనీర్లు ఉన్నాయని ఓ నివేదికలో వెల్లడైంది. 2012 నుంచి 2022 మధ్య హైదరాబాద్‌లో సంపన్నుల సంఖ్య 78 శాతం పెరిగిందని ఆ రిపోర్ట్ పేర్కొంది.
హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఫార్మా , సాఫ్ట్ వేర్ రంగాలకు నగరం కేరాఫ్ అడ్రస్ గా మారింది. పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులకు హైదరాబాద్ నే కేంద్రంగా ఎంచుకుంటున్నారు.
భాగ్యనగరానికి ఉన్న మరో ఫ్లస్ పాయింట్ వాతావరణం. అందుకే నగరంలోనే బడా వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు స్థిర నివాసాలు ఏర్పర్చుకుంటున్నారు. అందుకే గత పదేళ్ల హైదరాబాద్ లో సంపన్నల సంఖ్య పెరిగింది.
ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల నివేదిక -2023 హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ కంపెనీ విడుదల చేసింది. ఆ సంస్థ రూపొందించిన జాబితాలో అమెరికాలోని న్యూయార్క్ టాప్ ప్లేస్ లో ఉంది.
2022 డిసెంబర్ 31 నాటికి ఈ సిటీలో 3 లక్షల 40 వేల మంది మిలియనీర్లు ఉన్నట్లు వెల్లడించింది. మొత్తం 97 నగరాలకు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
జపాన్ రాజధాని టోక్యో 2,90,300 మంది మిలియనీర్లతో రెండో స్థానంలో నిలిచింది. 2,85,000 మంది మిలియనీర్లతో శాన్‌ఫ్రాన్సిస్కో మూడో స్థానంలో ఉంది.
లండన్ లో 2,58,000 మంది, సింగపూర్ లో 2,40,100 మంది, లాస్ ఏంజెల్స్ లో 2,05,400 మంది, హాంకాంగ్ లో 1,29,500 మంది , బీజింగ్ లో 1,28,000 మంది, షాంఘైలో 1,27,200 మంది, సిడ్నీలో 1,26,900 మంది మిలీయర్లు ఉన్నారని హెన్నీ అండ్ పార్ట్ నర్స్ సంస్థ తెలిపింది.
59,400 మంది మిలియనీర్లతో ముంబై 21వ స్థానం దక్కించుకొంది. 30,200 మిలియనీర్లతో ఢిల్లీ 36వ స్థానంలో, 12,600 మంది మిలియనీర్లతో బెంగళూరు 60వ స్థానంలో, 12,100 మంది మిలియనీర్లతో కోల్‌కతా 63వ స్థానంలో ఉన్నాయి.
2000లో తొలిస్థానంలో ఉన్న లండన్ ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది.హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ రూపొందించిన సంపన్న నగరాల జాబితాలో అమెరికా నుంచి అత్యధిక నగరాలకు స్థానం దక్కింది.
0 Comments:
Post a Comment