Search This Blog

Tuesday, 18 April 2023

Heatwave In India: విపరీతమై వేడిలో కూడా ఆరోగ్యంగా ఉండాలంటే..? వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు



దేశవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 11 గంటల దాటితే చాలు ఇంట్లోంచి బయటకి వచ్చే పరిస్థితి లేదు.

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో విపరీతంగా పెరుగుతున్న ఎండలతో ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో భారత వాతారణ శాఖ వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. బీహార్, పశ్చిమ బెంగాల్‌లో మరో రెండు రోజుల పాటు ఆరెంజ్ అలెర్ట్‌ను ప్రకటించింది. జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా వేడిగాలులు పెరిగి అవకాశం ఉంది.

అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా పాఠశాలలను మూసివేయాలని అనేక రాష్ట్రాలు కోరాయి. ఢిల్లీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పాఠశాలలు మధ్యాహ్నం మూసివేయాలని కోరారు.

అధిక ఉష్ణోగ్రతలు హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్, హీట్ ఎగ్జాషన్, హీట్ క్రాంప్స్ వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయొచ్చు. అధిక వేడి యొక్క దుష్ప్రభావాలను నివారించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలను అనుసరించడం చాలా కీలకం.

వడదెబ్బ నివారించేందుకు చిట్కాలు

వడదెబ్బ అనేది అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువ కాలం బహిర్గతం కావడం వల్ల కలిగే తీవ్రమైన అనారోగ్య పరిస్థితి. భారతదేశంలో చాలామంది వేసవి కాలంలో వడదెబ్బ గురై మరణిస్తారు. వడదెబ్బకు తక్షణ చికిత్స అవసరం, లేకుంటే మూత్రపిండాలు, కండరాలు, మెదడు, గుండె త్వరగా దెబ్బతింటుంది.

వడదెబ్బ లక్షణాలు:

శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుంది

గందరగోళం, అస్పష్టమైన మాటలు, చిరాకు

చెమట లేకుండా ఎరుపెక్కి, పొడిబారిన చర్మం

వేగవంతమైన శ్వాస, వాంతులు, వికారం

గుండె వేగంగా, ఎక్కువసార్లు కొట్టుకోవడం

తలనొప్పి,శరీర తిమ్మిరి

వడదెబ్బను ఎలా నివారించాలి:

వడదెబ్బకు గురైన సమయంలో ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. మండే ఎండలో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు పుష్కలంగా నీరు తాగాలి. కొబ్బరినీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, తాజా ఉండే రసాలు తీసుకోవాలి.

అధిక ఉష్ణోగ్రతలలో వ్యాయామం చేయడం మానుకోండి

చల్లటి నీటితో స్నానం చేయండి

లేత రంగు, వదులుగా, సౌకర్యవంతమైన బట్టలు ధరించండి

ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు బయటకి వెళ్లకుండా ఉండాలి

ఆల్కహాల్ తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే ఇది శరీరంలో ఎక్కువగా వేడిని ఉత్పత్తి చేస్తుంది.

వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఇతర చిట్కాలు:

బాగా హైడ్రేటెడ్‌గా ఉండండి

వేసవి కాలంలో దొరికే నీటిశాతం ఎక్కువగా ఉన్న పండ్లు, ఆహార పదార్థాలు తీసుకోవాలి.

సన్‌స్క్రీన్ ధరించండి, తేలికైన, పల్చటి దుస్తులను ధరించండి

మీ శరీర ఉష్ణోగ్రతను పెంచే చర్యలను నివారించండి

మీ ఆహారంలో శరీర శీతలకరణిగా పనిచేసే ఆహారాలను జోడించండి

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top