Headphones Effects: బీ అలర్ట్.. హెడ్ ఫోన్ వాడకంతో బ్యాక్టీరియా
ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకు సెల్ ఫోన్ (Cell Phones), కంప్యూటర్స్, ట్యాబ్స్ ను రెగ్యులర్ వాడుతున్నారు. దీంతో చాలామంది హెడ్ ఫోన్స్ (Headphones) వాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
హోం వర్క్ (Home work) చేయాలన్నా, వర్క్ ఫ్రం హోం చేయాలన్నా అటు ఉద్యోగులు, ఇటు విద్యార్థులు హెడ్ ఫోన్స్ ను విపరీతంగా వాడేస్తున్నారు. అయితే గంటల తరబడి హెడ్ ఫోన్స్ వాడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయట. వీటి వాడకం వల్ల చెవులపై ప్రభావం చూపుతాయట, చెవులపై (Ears) బ్యాక్టీరియా ఏర్పడి వివిధ సమస్యలకు దారితీస్తుంది. హెడ్ ఫోన్ ధరించడం వల్ల 700 రెట్ల వరకు బ్యాక్టీరియా ఏర్పడవచ్చునని పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి.
హెడ్ ఫోన్ల వాడకంతో గుండె (Heart) జబ్బు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇయర్ ఫోన్లతో వినికిడి సామర్థ్యం దెబ్బతిని అది గుండె జబ్బులకు దారితీస్తోందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది హృదయ స్పందనల రేటును పెంచుతుంది. ఫలితంగా గుండె జబ్బులు చుట్టు ముట్టే ప్రమాదం ఏర్పడుతోంది. దీనిపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇయర్ ఫోన్లతో ధ్వని భ్రాంతి కూడా కలుగుతుంది.
అంతేకాదు హెడ్ ఫోన్స్ ఒకరి చెవి నుంచి మరొకరి చెవిలో పెట్టుకుంటే బ్యాక్టీరియా సోకే అవకాశాలు ఉన్నాయి. ఇయర్ ఫోన్లలో ఉండే స్పాంజి వల్ల ఒకరి నుంచి మరొకరికి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఇవి ఎక్కువ సేపు చెవిలో ఉంచుకుంటే చెవి నరాలపై ఒత్తిడి పడుతుంది. సిరల వాపుకు కారణమవుతుంది. కంపనం వల్ల వినికిడి కణాలు సున్నితత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. హెడ్ ఫోన్లు చెవిలో పెట్టుకుని పాటలు (Songs), సంగీతం వింటూ లోకాన్ని మరచిపోతుంటారు. చుట్టుపక్కల ఏం జరిగినా పట్టించుకోరు. ఇయర్ ఫోన్ల ప్రభావంతో చెవిపోటు వస్తుంది. ఇయన్ ఫోన్ల వాడకంతో చెవికి ఎన్నో ఇబ్బందులు వస్తాయి.
0 Comments:
Post a Comment