Good News: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు వారి ఖాతాల్లోకి నగదు విడుదల.. అర్హులు ఎవరంటే..?
Jagananna Vidya Deevena: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమంపై పూర్తి ఫోకస్ చేస్తున్నారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ఉన్న పథకాలకు సమయానికి డబ్బులు అందిస్తున్నారు. నిధులు లేకపోయినా.. కాస్త ఆలస్యంగానైనా చెప్పిన పథకాలకు నగదు విడుదల చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా రేపు జగనన్న వసతి దీవెనకు నగదు బటన్ నొక్కి విడుదల చేయనున్నారు.
రేపు సీఎం జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో నిర్వహించనున్న 'జగనన్న వసతి దీవెన' కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు. బుధవారం ఉదయం8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.20 గంటలకు నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు సీఎం చేరుకుంటారు.
10.40 - 12.35 గంటల వరకు నార్పల క్రాస్‌రోడ్స్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగిస్తార, తరువాత జగనన్న వసతి దీవెన కార్యక్రమం ఉంటుంది. నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. కార్యక్రమం తరువాత మధ్యాహ్నం 1.10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 26న జిల్లా పర్యటనకు విస్తున్నారని కలెక్టర్ గౌతమి తెలిపారు. సీఎం పర్యటనపై కలెక్టర్ ఆదివారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్ నుంచి సభాస్థలి వరకు బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు, లబ్ధిదారులను సమావేశానికి బస్సుల్లో తీసుకురావాలని సూచించారు.
సీఎం పర్యటనకు సంబంధించి నార్పలలో సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాల ఏర్పాట్లను ఆదివారం సీఎం కార్యక్రమాల కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, ఎస్పీ కంచి శ్రీనివాస్‌రావు, జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్, ఆర్డీఓ మధుసూదన్ పరిశీలించారు.
ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా ఐటీఐ విద్యార్ధులకు 10 వేలు ప్రతి ఏటా రెండు వాయిదాల్లో.. పాలిటెక్నిక్ విద్యార్ధులకు 15 వేల రూపాయలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు నేర్చుకునే వారికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం. ఈ నగదు విడుదల చేసేందుకు రేపు సీఎం జగన్ అనంతపురం జిల్లాకు వస్తున్నారు.
022-23 విద్యా సంవత్సరానికి గాను జగనన్న వసతి దీవెన నగదును మొదట మార్చ్ 31నే విడుదల చేయాల్సి ఉండుంగా.. దాన్ని ఏప్రిల్ 17కి వాయిదా వేశారు. ఆ తరువాత ఇఫ్తార్ విందు ఉంది అంటూ రెండోసారి వాయిదా వేశారు. అయితే అలా వాయిదా పడడానికి నిధులు లేకపోవడమే కారణమని ఏపీ సీఎస్ వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఆ అడ్డంకులు దాటుకుని రేపు అనంతపురం లో నగదు విడుదల చేయనున్నారు సీఎం జగన్..
జగనన్న వసతి దీవెన పథకానికి అర్హులు ఎవరు?
వసతి దీవెన పథకానికి పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ ఆపై చదువులు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, యూనివర్శిటీలు, బోర్డుల్లో చదివేవారు అర్హులు. డే స్కాలర్, కాలేజ్ అటాచ్ హాస్టల్స్, డిపార్ట్‌మెంట్ అటాచ్ హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులకు అవకాశం ఉంది. విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. అలాగే ప్రైవేట్ యూనివర్శిటీలు, డీమ్డ్ యూనివర్శిటీల్లో చదివేవారు అనర్హులు.
ఎవరు అర్హులు కారంటే..?
కరెస్పాండెన్స్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులు చదివేవారు అనర్హులు. మేనేజ్‌మెంట్, స్పాట్ కోటాలో చదివేవారు అర్హులు కాదు. వీరితో పాటు కుటుంబం మొత్తం వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షలలోపు ఉండాలి. పది ఎకరాల మాగాణి.. 25 ఎకరాల మెట్ట భూములుపైన ఉంటే అనర్హులు.
విద్యార్థి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, పింఛన్‌దారులు ఉంటే అనర్హులు. నాలుగు చక్రాల వాహనాలు ఉండకూడదు (కారు, ట్రాక్టర్, ఆటో). పట్టణ ప్రాంతాల్లో 1500 చదరపు అడుగులలోపు ఇల్లు ఉన్నవారే అర్హులు.. కుటుంబంలో ఐటీ రిటర్న్స్ చేసేవారు ఉండకూడదు.
0 Comments:
Post a Comment