Gold - వరుసగా ఐదోరోజు తగ్గిన బంగారం ధరలు; నేడు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలిలా!!
విపరీతంగా పెరిగిన బంగారం ధరలు మళ్ళీ తగ్గుముఖం పడుతున్నాయి. గత ఐదు రోజులుగా బంగారం ధరలలో తగ్గుదల నమోదు అవుతుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు ఇప్పటికే కొండకి కూర్చున్నాయి.
సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేనంతగా బంగారం ధరలు ఆందోళనకరంగా పెరిగాయి. 60 వేలకు పైగా స్వచ్ఛమైన బంగారం ధరలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉంటే నేడు దేశీయంగా బంగారం ధరలలో తగ్గుదల నమోదయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం మీద 390 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం మీద 430 రూపాయల మేర బంగారం ధర తగ్గింది. హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో ప్రస్తుతం 55,400గా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,430 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,550 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,580 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది.
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,400గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,430 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది .ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కడప, కర్నూలు, చిత్తూరు, కాకినాడ, రాజమండ్రి వంటి నగరాలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,400గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,430 రూపాయలుగా కొనసాగుతుంది.
ఇది ఇలా ఉంటే దేశంలోనే బంగారం ధరలు ఎక్కువగా ఉండే తమిళనాడు రాష్ట్రంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61 వేలకు పైగా నేడు విక్రయించబడుతుంది. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూరు, మధురై, సేలం, తిరుపూరు, తిరుచ్చి, తిరునవ్వేలి, ఈ రోడ్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56 వేలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61 వేల 100 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. మొత్తంగా బంగారం ధరలు గత ఐదు రోజుల నుంచి తగ్గుతున్నప్పటికీ, ధర మాత్రం 60 వేలను దాటే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే కొనుగోలు చేయలేనంతగా పెరిగిపోయిన బంగారం ధరలు ఇంకా తగ్గాలని సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
0 Comments:
Post a Comment