Gold Rates: పరుగుల పోటీలో పసిడి.. గ్రాము ధర రూ.10,000 చేరనుందా..? నేటి ధరలిలా..
Gold Rates: పసిడి ధరలు తగ్గాయి అనగానే భారత మహిళలు షాపింగ్ యుద్ధం ప్రకటించేస్తారు. అలాంటి కొన్నాళ్లలో వాటి ధరలు అందరి ద్రాక్షగా మారే ప్రమాదం ఉందనే వార్త గురించి తెలిస్తే అప్పుచేసైనా ఇప్పుడే బంగారం కొనేస్తారేమో..?
ఎందుకంటే దీనికి బంగారంపై వారికి ఉండే మోజే కారణం.
ప్రస్తుతం దేశంలో స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధరను గమనిస్తే.. దాదాపు రూ.61 వేల మార్కు వద్ద ఉంది. కరోనా సమయంలో గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.39 నుంచి రూ.40 లక్షల మధ్య ఉండేది. అయితే ఏడాది చివరి నాటికి రూ.65 వేల నుంచి రూ.70 వేల మధ్యకు చేరుకుంటుందని ఇప్పటికే ఈ రంగంలోని నిపుణులు, ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
బంగారం ధరలు ఎల్లప్పుడూ 20 శాతం తేడాలో ఊగిసలాడుతుంటాయి. ఇందుకు కరోనా నుంచి కోలుకున్న తర్వాత బంగారం ఏకంగా రూ.69 వేల స్థాయికి చేరుకోవటమే పెద్ద ఉదాహరణ. ఈ లెక్కన రానున్న కొన్ని సంవత్సరాల్లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.లక్షకు చేరుకుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొంత మంది ఆభరణాల రూపంలో బంగారాన్ని కొంటుంటే మరికొందరు మాత్రం ధరలు పెరిగాక అమ్ముకోవాలని చూస్తున్నారు.
ఈరోజు 10 గ్రాముల 22 కారెట్ల బంగారం ధర దాదాపు రూ.200 వరకు తగ్గగా.. 24 గ్రాముల స్వచ్ఛమైన మేలిమి బంగారం ధర మాత్రం రూ.220 వరకు తగ్గాయి. ఇదే క్రమంలో కిలో వెండి ధర దాదాపు రూ.200 వరకు తగ్గింది. నిన్న కిలో రూ.77,600గా ఉన్న గోల్డ్.. తాజా తగ్గింపు తర్వాత రూ.77,400 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో రేట్లను గమనిస్తే 10 గ్రాముల 24 కారెట్ల బంగారం ధర.. చెన్నైలో రూ.61,640, ముంబైలో రూ.60,930, దిల్లీలో రూ.61,080, బెంగళూరులో రూ.60,980, పుణేలో రూ.60,930, వడోదరలో రూ.60,980, కోయంబత్తూర్ లో రూ.61,640గా ఉన్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ధరలను పరిశీలిస్తే హైదరాబాదులో రూ.60,930 ఉండగా.. వరంగల్, ఖమ్మం వంటి నగరాల్లోనూ ఇవే రేట్లున్నాయి. ఇక విశాఖపటన్నం, విజయవాడ, తిరుపతి,అనంతపూర్ వంటి నగరాల్లో ధరలు రూ.రూ.60,930 వద్ద ఉన్నాయి.
0 Comments:
Post a Comment