బంగారం ధర భవిష్యత్తులో 50,000 దిగిపోయే తగ్గే అవకాశం ఉందని నిపుణుల అంచనా వేస్తున్నారు దీనికి గల కారణాలను చూస్తే నిజమే అని అనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను చూస్తూ ఉంటే పసిడి ధరలు త్వరలోనే దిగివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బంగారం ధర రికార్డు స్థాయిలో పెరుగుతోంది ఈ నేపథ్యంలో పసిడి ప్రేమికులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా బంగారం ధర సోమవారం పది గ్రాములకు గానూ 24 క్యారట్ల గానూ రూ. 61,030 పలుకుతోంది.
అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 55,940 పలుకుతోంది. అయితే బంగారం ధర గడచిన 15 రోజులుగా గమనించినట్లయితే వరుసగా పెరుగుతూనే వస్తోంది ప్రస్తుతం రికార్డ్ స్థాయి వద్ద బంగారం ధర పలుకుతోంది ఈ నేపథ్యంలో అక్షయ తృతీయ నాటికి బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈనెల 22న అక్షయ తృతీయ పండుగను హిందువులు దేశవ్యాప్తంగా జరుపుకొనున్నారు. ఈ పర్వదినాన బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే సంవత్సరమంతా శుభం జరుగుతుందని లక్ష్మీదేవి నట్టింట్లో కొలువవుతుందని భక్తుల నమ్మకం ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఎంతో కొంత బంగారం కొనుగోలు చేసేందుకు తమ కష్టార్జితాన్ని వెచ్చిస్తారు.
మరోవైపు బంగారం ధర అంతర్జాతీయంగా కూడా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా బంగారం ధర ఒక ఔన్సు అంటే 31 గ్రాముల ధర 2000 డాలర్లు దాటిపోయింది. దీంతో అంతర్జాతీయంగా కూడా బంగారం ధర పెరుగుతుంది.
అయితే ఇప్పటికే ఎంసీఎక్స్ లో బంగారం ధర 61000 దాటిపోయింది ఈ నేపథ్యంలో అటు రిటైల్ మార్కెట్లో కూడా బంగారం ధర పెరుగుతూ వస్తోంది. అయితే పసిడి ఆకాశాన్ని తాకడం ఇదేం కొత్త కాదు. 2020లో కూడా బంగారం ధరలు 56000కు తగ్గాయి.
కానీ అక్కడ నుంచి పతనమై 48 వేలకు చేరింది. అని ప్రస్తుతం బంగారం ధర 61,000 దాటింది అయితే ఈ రేంజ్ నుంచి బంగారం ధర తగ్గడం కాస్త కష్టమేనని అంచనా వేస్తున్నారు. అయితే భవిష్యత్తులో మాత్రం బంగారం తగ్గే అవకాశం ఉందని మాత్రం చెబుతున్నారు
బంగారం తగ్గడానికి గల అవకాశాలకు కారణాలు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సమస్యగా మారింది. ప్రపంచంలోనే అన్ని దేశాలకు మాంధ్యం దెబ్బ తగిలింది.
దీని నుంచి బయటపడేందుకు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అయినా అమెరికా, జర్మనీ, ఇటలీ, జపాన్, చైనా, రష్యా తమ అపారమైన బంగారు నిలువల నుంచి కొంత భాగాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బంగారం ధర భారీగా తగ్గే అవకాశం ఉంది.
2007 సంవత్సరంలో కూడా ఈ విధంగానే ప్రపంచ ఆర్థికంగా సమయంలో గ్రీస్, సైప్రస్ వంటి దేశాలు పెద్ద ఎత్తున బంగారాన్ని రిటైల్ మార్కెట్లో విక్రయించాయి. దీంతో మార్కెట్లో బంగారం ధర ఒకసారిగా తగ్గిపోయింది.
ప్రస్తుతం అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే కనుక నిజమైతే బంగారం ధర మరోసారి 50వేలకు దిగివచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు మరి ఏం జరుగుతుందో ముందు ముందు వేచి చూడాల్సి ఉంది.
0 Comments:
Post a Comment