Flight Path at Night : మనిషి తన తెలివితో ఎన్నో విషయాలు కనుగొన్నాడు. చేపలా ఈదడం నేర్చుకున్నాడు. పక్షిలా ఎగరడం నేర్చుకున్నాడు.
ఇలా నిరంతరం తన మేథస్సుతో ఎన్నో నూతన విషయాలు ఆవిష్కరించాడు. ఇందులో భాగంగానే ఆకాశంలో ఎగిరేందుకు విమానం కనుగొన్నాడు.
సుదూర ప్రాంతాలను కొన్ని గంటల్లోనే చేరుకునేందుకు వీలవుతోంది. దీంతో అందరికి విమానంలో ప్రయాణం చేయాలని అనుకుంటారు. కానీ వీలు కాదని ఆ ఆశను వదులుకుంటారు.
విమానం ఎలా కదులుతుంది? ఎలా వెళ్తుంది? అనే విషయాలపై అందరికి ఆసక్తి ఉంటుంది. ఇంకా రాత్రి పూట విమానం ఎలా వెళ్తుంది? దారి ఎలా కనిపిస్తుందనే దానిపై తెలుసుకోవాలనే ఆతృత ఎక్కువగా ఉండటం సహజమే.
రాత్రి విమానం ఎలా వెళ్తుంది?
రాత్రి సమయంలో అంతా చీకటిగా ఉంటుంది. మనకు ఏమీ కనిపించదు. కానీ ఆ సమయంలో కూడా విమానాలు తిరుగుతుంటాయి. మరి అవి ఎలా తిరుగుతాయి? ఏం కనిపించదు కదా ఎలా వెళతాయి? అందులో రహస్యమేంటి? అనే విషయాలు గుర్తుకు వస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు.
రాత్రి సమయంలో పైలెట్లు ఇన్ స్ట్రుమెంట్ల సహాయంతో నడిపిస్తారని చెబుతుంటారు. విమానం నడిచేందుకు ఏవి సహకరిస్తాయనే దానిపై అందరు అనుమానాలు వ్యక్తం చేయడం సహజమే.
జీపీఎస్ సాయంతో..
విమానాలు ప్రయాణించడానికి జీపీఎస్ సాయపడుతుంది. దాని ఆధారంగానే విమానం రాకపోకలు సాగిస్తుంది. మనం చేరాల్సి గమ్యం ఎంత దూరం ఉంటుంది. మనం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాలి.
ఎంత సమయం పడుతుంది తదితర విషయాలు నిక్షిప్తం అయి ఉంటాయి. వాటి సాయంతోనే విమాన ప్రయాణాలు సాధ్యం అవుతాయి. సరిగ్గా మనం చేరే గమ్యం చూసుకుని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే వాటిని నడుపుతుంటారు.
ఇన్ స్ట్రుమెంట్లే కీలకం
రాత్రి సమయంలో విమానాల రాకపోకలు ఇన్ స్ట్ర్టుమెంట్స్ పైనే ఆధారపడి ఉంటుంది. వీటి సాయంతోనే పైలెట్ విమానాన్ని రాత్రి సమయంలో నడుపుతుంటాడు.
ఇలా విమానాల ప్రయాణాల్లో మనకు తెలియని ఎన్నో విషయాలు దాగి ఉంటాయి. దీంతో విమానాల గమనం గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ఉంటుంది.
ల్యాండింగ్ సమయంలో లైట్లపైనే ఆధారపడుతుంటారు. ఆకాశంలో వెళ్లే సమయంలో మాత్రం ఇన్ స్ట్రుమెంట్లు బాగా వాడుతారు.
ఇలా విమానాల రాకపోకల్లో ఇంతటి రహస్యం దాగి ఉంటుందనే విషయం చాలా మందికి తెలియదు.
0 Comments:
Post a Comment