ఈపీఎఫ్‌వోలో 2674 కొలువులు
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో).. సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
న్యూదిల్లీలోని ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీలను ప్రాంతాల వారీ భర్తీ చేయనుంది. కంప్యూటర్ బేస్ట్ టెస్ట్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ (ఎస్‌ఎస్‌ఏ- గ్రూప్-సి) పోస్టులు దేశవ్యాప్తంగా 2674 ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రీజియన్‌లో 39, తెలంగాణ రీజియన్‌లో 116 ఉన్నాయి. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పాసై.. నిమిషానికి 35 ఇంగ్లిష్ పదాలు లేదా నిమిషానికి 30 హిందీ పదాలు కంప్యూటర్‌పైన టైప్ చేయగల నైపుణ్యం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి అర్హులు. డిగ్రీ చివరి ఏడాది పరీక్ష ఫలితాలు రానివారు దరఖాస్తు చేయడానికి అనర్హులు.
దరఖాస్తు గడువు తేదీ అయిన 26.04.2023 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు మూడేళ్లు, దివ్యాంగులకు పది నుంచి పదిహేను ఏళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్-జనరల్‌కు మూడేళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్-ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు ఆరేళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్-ఎస్సీ/ ఎస్టీలకు ఎనిమిదేళ్లు, పీడబ్ల్యూడీ-జనరల్ అభ్యర్థులకు పదేళ్లు, పీడబ్ల్యూడీ-ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు పదమూడేళ్లు, పీడబ్ల్యూడీ-ఎస్సీ/ఎస్టీలకు పదిహేనేళ్ల సడలింపు ఉంటుంది. వేతనశ్రేణి లెవెల్-5 కింద నెలకు రూ.29,200-92,300 వరకు ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇతర ప్రోత్సాహకాలనూ అందుకోవచ్చు.
రాత పరీక్ష: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 150 ప్రశ్నలకు 600 మార్కులు ఉంటాయి. జనరల్ ఆప్టిట్యూడ్ (30 ప్రశ్నలకు 120 మార్కులు), జనరల్ నాలెడ్జ్/ జనరల్ అవేర్‌నెస్ (30 ప్రశ్నలకు 120 మార్కులు), క్వాంటిటేటివ్ ఎబిలిటీ (30 ప్రశ్నలకు 120 మార్కులు), జనరల్ ఇంగ్లిష్ విత్ కాంప్రహెన్షన్ (50 ప్రశ్నలకు 200 మార్కులు), కంప్యూటర్ లిటరసీ (10 ప్రశ్నలకు 40 మార్కులు) అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు కేటాయించారు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ నాలుగోవంతు మార్కులను తగ్గిస్తారు. ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఫేజ్-1లో కనీసార్హత మార్కులను ఈపీఎఫ్‌వో తర్వాత నిర్ణయిస్తుంది.
ఏ అంశాల నుంచి ?
ఇంగ్లిష్‌లో.. రీడింగ్ కాంప్రహెన్షన్, ఫిల్లర్స్ (డబుల్ ఫిల్లర్స్, మల్టిపుల్ సెంటెన్స్ ఫిల్లర్స్, సెంటెన్స్ ఫిల్లర్స్), క్లోజ్ టెస్ట్, ఫ్రేజ్ రీప్లేస్‌మెంట్, ఆడ్ సెంటెన్స్, పేరా జంబుల్స్, ఇన్‌ఫరెన్స్, సెంటెన్స్ కంప్లీషన్, కనెక్టర్స్, పేరాగ్రాఫ్ కన్‌క్లూజన్, ఫ్రేజల్ వెర్బ్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్, వర్డ్ యూసేజ్, వొకాబ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి.
రీజనింగ్ ఎబిలిటీ/ జనరల్ ఆప్టిట్యూడ్‌లో: పజిల్స్, సీటింగ్ ఎరేంజ్‌మెంట్, డైరెక్షన్ సెన్స్, బ్లడ్ రిలేషన్, సిలాజిజం, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, కోడింగ్-డీకోడింగ్, మెషీన్ ఇన్‌పుట్-అవుట్‌పుట్, ఇన్ ఈక్వాలిటీస్, ఆల్ఫా న్యూమరిక్-సింబల్ సిరీస్, డేటా సఫీషియన్సీ, లాజికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
న్యూమరికల్ ఆప్టిట్యూడ్: డేటా ఇంటర్‌ప్రెటేషన్, ఇన్ ఈక్వాలిటీస్, నంబర్ సిరీస్, అప్రాక్సిమేషన్ అండ్ సింప్లిఫికేషన్, డేటా సఫిషియెన్సీ, హెచ్‌సీఎఫ్ అండ్ ఎల్‌సీఎం, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాబ్లమ్ ఆన్ ఏజెస్, వర్క్ అండ్ టైమ్, స్పీడ్ డిస్టెన్స్ అండ్ టైమ్, ప్రాబబిలిటీ, మెన్సురేషన్, పెర్‌మ్యుటేషన్ అండ్ కాంబినేషన్, యావరేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పార్టనర్‌షిప్, ప్రాబ్లమ్స్ ఆన్ బోట్స్ అండ్ స్ట్రీమ్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, మిక్చర్ అండ్ ఎలిగేషన్, పైప్స్ అండ్ సిస్టన్స్ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
జనరల్ అవేర్‌నెస్: బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ అవేర్‌నెస్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
కంప్యూటర్ అవేర్‌నెస్: హిస్టరీ అండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్, ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ ఆర్గనైజేషన్, కంప్యూటర్ మెమరీ, కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ ఐ/ఓ డివైజస్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ లాంగ్వేజెస్, ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ నెట్‌వర్క్, ఇంటర్నెట్, ఎంఎస్-ఆఫీస్ సూట్ అండ్ షార్ట్‌కట్ కీస్, బేసిక్స్ ఆఫ్ డీబీఎంఎస్, నంబర్ సిస్టమ్ అండ్ కన్‌వర్షన్స్, కంప్యూటర్ అండ్ నెట్‌వర్క్ సెక్యూరిటీ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
ఫేజ్-1లో భాగమైన రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను 1:10 నిష్పత్తిలో ఫేజ్-2కు ఎంపికచేస్తారు. ఫేజ్-2లో కంప్యూటర్ స్కిల్ టెస్ట్ (కంప్యూటర్ డేటా ఎంట్రీ టెస్ట్) ఉంటుంది. ఈ పరీక్షలో డేటా ఎంట్రీలో అభ్యర్థి టైపింగ్ వేగాన్ని పరీక్షిస్తారు. కంప్యూటర్‌పైన ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలను లేదా హిందీలో నిమిషానికి 30 టైప్ చేయగలగాలి. ఈ స్కిల్ టెస్ట్ అర్హత పరీక్ష మాత్రమే. దీంట్లో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. రాత పరీక్షలో సాధించిన మార్కులను మాత్రమే తుది ఎంపికకు లెక్కిస్తారు. సీబీటీలో సాధించిన ర్యాంకు, మెడికల్ ఫిట్‌నెస్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
గుర్తుంచుకోవాల్సినవి
* ఒకరు ఒక ఆన్‌లైన్ దరఖాస్తును మాత్రమే పంపాలి. ఒకటికంటే ఎక్కువ అప్లికేషన్లు పంపితే.. చివరిగా పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
* పరీక్ష ఫలితాలను ఎన్‌టీఏ, ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతారు. తాజా సమాచారం కోసం అభ్యర్థులు తరచూ వెబ్‌సైట్‌ను సందర్శిస్తుండాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 26.04.2023
వెబ్‌సైట్: https://www.epfindia.gov.in/
0 Comments:
Post a Comment