Election Commission Of India: మూడు పార్టీలకు ఈసీ షాక్.. జాతీయ పార్టీ హోదా రద్దు..
దేశంలో రాజకీయ పార్టీల సంఖ్య చాలా తక్కువ. కొన్నేళ్ల నుంచి అనేక పార్టీలు జాతీయ పార్టీ హోదాను కోల్పోతున్నాయి. తాజాగా ఈ జాబితాలో మరో మూడు పార్టీలు చేరిపోయాయి.
పశ్చిమ బెంగాల్‌లోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్,(Trinamool Congress) శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ,(Nationalist Congress Party) సీపీఐ(కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) పార్టీలు జాతీయ పార్టీ హోదాను కోల్పోయాయి. ఈ మూడు పార్టీలకు సంబంధించి జాతీయ పార్టీ హోదాను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఇటీవల కాలంలో అనే రాష్ట్రాల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ.. ఓట్ల శాతాన్ని నమోదు చేసుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు జాతీయ పార్టీ హోదా కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) జాతీయ పార్టీ హోదాకు సంబంధించి ఏప్రిల్ 13లోగా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని గత వారం కర్ణాటక హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
మరోవైపు 2019 జులైలో ఎన్‌సిపి, టిఎంసి, సిపిఐ పార్టీలకు కేంద్రం ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ సంవత్సరం లోక్‌సభ ఎన్నికలలో తమ పనితీరు తర్వాత తమ జాతీయ పార్టీ హోదాను ఎందుకు తిరస్కరించకూడదో చెప్పాలని వివరణ కోరింది. తాజాగా ఆ పార్టీల జాతీయ పార్టీ హోదా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
నిబంధనల ప్రకారం ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే, అది నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో (లేదా) లోక్‌సభలో 2% సీట్లు పొందిన రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి. ఒకసారి ఒక పార్టీ జాతీయ పార్టీ హోదాను కోల్పోతే, ఆ పార్టీ గుర్తించబడని రాష్ట్రాల్లో దాని అభ్యర్థులకు ఉమ్మడి గుర్తును పొందలేదు.
ఉదాహరణకు కర్ణాటకలో తృణమూల్ అభ్యర్థులు పోటీ చేయాలని ఎంచుకుంటే ఎన్నికలకు దాని గుర్తును పొందలేరు. కేంద్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయం అనంతరం దేశంలో ఆరు జాతీయ పార్టీలు ఉన్నాయి. బీజేపీకాంగ్రెస్ , సిపిఎం, బహుజన్ సమాజ్ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి)తోపాటు తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ ఈ జాబితాలో చోటు దక్కించుకుంది.
0 Comments:
Post a Comment