Donald Trump: తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది.. ఇది ట్రంప్ నకు అనుభవంలోకి వచ్చింది. ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షుడు కావాలని కలలు కంటున్నారు.
కానీ ఆయన కలలను అమెరికన్ పోలీసులు కల్లలు చేశారు. కటకటాల వెనక్కి పంపించారు.. ఇంతకీ ట్రంప్ చేసిన నేరమేమిటి? దానికి పడే శిక్ష ఏమిటి? వచ్చే ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు సగటు అమెరికన్ ను ఈ ప్రశ్నలు తొలుస్తున్నాయి.
అమెరికా చరిత్రలోనే ఒక మాజీ అధ్యక్షుడు అరెస్టు అవడం ఇదే మొదటిసారి. 2016 నాటి హుష్ మనీ కేసులో ఆయన పై మాన్ హాట్టన్ కోర్టులో ఏకంగా 30 అభియోగాలు నమోదయ్యాయి.. ఈ కేసు పూర్వ పరాల్లోకి వెళ్తే 2006లో లేక్ తాహో అనే హోటల్లో స్టార్మీ డేనియల్స్ అనే నటితో అతడు శృంగారంలో పాల్గొన్నాడనే ఆరోపణలు ఉన్నాయి.. స్వయంగా డేనియల్స్ అన్ని వెల్లడించింది.'
నేను ట్రంప్ ఒక కార్యక్రమంలో కలుసుకున్నాం.. ఆ తర్వాత డిన్నర్ చేశాం. లేక్ తాహో హోటల్లో శృంగారంలో పాల్గొన్నాం' అని డేనియల్ చెబుతోంది.
2016 అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల ముందు ట్రంప్ ఈ విషయంలో ఆమె నోటికి తాళం వేయాలని నిర్ణయించాడు.. తన వ్యక్తిగత అడ్వకేట్ కోహెన్ ద్వారా డేనియల్స్ కు 1.30 లక్షల అమెరికా డాలర్లు ముట్టజెప్పాడు.
సరిగా దీనిపైనే మాన్ హాట్టన్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఈ కోర్టులో ఈ వ్యవహారంపై 34 నేరారోపణలు నమోదయ్యాయి..
ఇక ఈ వ్యవహారం తర్వాత న్యూయార్క్ పోలీసులు ట్రంప్ ను తమ కష్టాల్లోకి తీసుకున్నారు. ఫోటోలు, వేలి ముద్రలు కూడా తీసుకున్నారు. సాంకేతికంగా ట్రంప్ ను అరెస్టు చేశారు కానీ… చేతికి మాత్రం బేడీలు వేయలేదు. ఇక ట్రంప్ అభిమానులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తూనే ఉన్నారు.
అయితే ఈ వ్యవహారంపై ట్రంప్ ఎట్టకేలకు నోరు విప్పాడు.. తనకు ఆ శృంగార నటికి ఎటువంటి లైంగిక సంబంధాలు లేవని తేల్చి చెప్పాడు.. అంతేకాదు తనను దోషిగా ప్రకటించవద్దని కోర్టును కోరాడు.
Donald Trump
అయితే అమెరికన్ చట్టాల ప్రకారం అభియోగాల మీద కోర్టుకు వెళ్లిన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. కాకపోతే ప్రచారంలో పాల్గొనేందుకు అవకాశం ఉండదు. ప్రమాణ స్వీకారాన్ని కూడా జైల్లో ఉండి చేయొచ్చు.
ఆ తర్వాత అతడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే కొంతకాల పరిమితితో అయినా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని సచ్చీలుడిగా బయటకు రావాల్సి ఉంటుంది.
లేనిపక్షంలో తదుపరి అమెరికన్ చట్టాల ప్రకారం కోర్టులు నడుచుకుంటాయి.. అయితే అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కచ్చితంగా పోటీ చేయవచ్చు.
ఎందుకంటే ఆయన 2024లో అమెరికన్ పీఠాన్ని ఎక్కాలి అనుకుంటున్నారు. ఇందుకు సంబంధించి అనేక ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.
అనుకోని ఘటన నేపథ్యంలో ప్రస్తుతం జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. త్వరలోనే ట్రంప్ బయటికి వస్తాడు అని ఆయన అభిమానులు అంటున్నారు.
0 Comments:
Post a Comment