Dog Repellent: వీధి కుక్కలు ఇక మీ బండి వెంటబడవ్ ..'అల్ట్రాసోనిక్ డాగ్ రిపెల్లెంట్'ను కనిపెట్టిన వ్యక్తి..
భారతదేశంలోని చాలా నగరాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువ అవుతోంది.
ఇటీవల కాలంలో వీటి దాడులు ఎక్కువ అయ్యాయి. ఇవి సైకిల్లు, మోటార్‌సైకిల్స్‌పై వెళ్లే వారిని కూడా తరుముతూ హడల్ పుట్టిస్తున్నాయి. కాబట్టి బైకర్స్ జాగ్రత్తగా ఉండక తప్పడం లేదు.
అయితే ఈ సమస్యకు ఒక వ్యక్తి అద్భుతమైన పరిష్కారం కనుగొన్నాడు. సేఫ్ బైక్ రైడ్ కోసం అల్ట్రాసోనిక్ డాగ్ రిపెల్లెంట్ (Ultrasonic Dog Repellent) అనే డివైజ్‌ను డెవలప్ చేశాడు. కుక్కలు బైక్‌ను ఛేజ్ చేయకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎలా పనిచేస్తుంది? : అల్ట్రాసోనిక్ డాగ్ రిపెల్లెంట్ డివైజ్ అనేది హై-ఫ్రీక్వెన్సీ శబ్దాలను విడుదల చేస్తుంది. తద్వారా బైక్ నడుపుతున్నప్పుడు కుక్కలు రైడర్ వద్దకు రాకుండా లేదా దాడి చేయకుండా ఆపుతుంది. ఈ అల్ట్రాసోనిక్ డాగ్ రిపెల్లెంట్ అనేది రైడర్ బైక్‌కి వెనుక భాగంలో జోడించాలి. ఈ డివైజ్ మానవ వినికిడి పరిధికి మించిన హై-ఫ్రీక్వెన్సీ సౌండ్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది కుక్కలకు పెద్దగా వినిపిస్తుంది కానీ మనుషులకు తీవ్రంగా వినిపించదు.
ఈ ఫ్రీక్వెన్సీకి కుక్కలు భయపడిపోయి సైకిల్ లేదా బైక్‌ను తరమడం మానేస్తాయి. అప్పుడు బైకర్ సురక్షితంగా, భయం లేకుండా ఏ వీధి కుక్కల ముందు నుంచైనా వెళ్లొచ్చు. ఈ డివైజ్ జంతువులకు ఏ విధంగానూ హాని కలిగించదు, కానీ దూకుడుగా ఉండే వీధి కుక్కల సమస్యకు సురక్షితమైన, మానవీయమైన పరిష్కారాన్ని అందిస్తుంది.
డివైజ్ సామర్థ్యం : నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా ఈ డివైజ్ నిజంగానే కుక్కలను ఆమడ దూరం ఉంచగలదు. వైరల్ అవుతున్న వీడియోలో ఈ డివైజ్ పనితీరు కూడా స్పష్టంగా తెలిసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్(Reddit)లో షేర్ చేసిన వీడియో చూస్తుంటే మనకు ఒక బైక్ లేదా సైకిల్‌పై ఒక వ్యక్తి వేగం గా వెళ్తుండటం చూడవచ్చు. అయితే వీధిలోని కుక్కలన్నీ అతని వెంట పడటం ప్రారంభించాయి. దాంతో సదరు బైకర్ తన అల్ట్రాసోనిక్ డాగ్ రిపెల్లెంట్‌ను ఆన్ చేశాడు. అంతే, చాలా దూకుడుగా వెంటపడిన కుక్కలు ఆ శబ్దం విని తోకముడిచి తిరుగు ముఖం పట్టాయి. ఇలా వీధి కుక్కలు వెంటపడిన ప్రతిసారీ ఆ వ్యక్తి అల్ట్రాసోనిక్ డాగ్ రిపెల్లెంట్‌ను ఆన్ చేస్తూ సౌండ్ రిలీజ్ చేశాడు. ఆ శబ్దానికి భయపడిన కుక్కలు వెనక్కు పరుగెత్తాయి.
నెటిజన్లు ఫిదా : వృత్తాకారంలో ఉన్న ఈ డివైజ్‌పైన బ్లూ, రెడ్ తదితర రంగుల లైట్లు కనిపించాయి. డివైజ్ సౌండ్ ఆన్ అయినప్పుడల్లా శబ్దం వినిపించింది. ఈ పరికరాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సొల్యూషన్ సూపర్‌గా ఉంది అని కామెంట్లు చేస్తున్నారు. ఒక రెడిట్ యూజర్ కామెంట్ చేస్తూ.. "నేను పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాను, ఈ పరికరం నాకు లైఫ్ సేవర్ అవుతుంది" అని కామెంట్ చేశాడు. ఇక చాలామంది వీధి కుక్కలు వెంటపడినప్పుడు తాము భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. "ప్రతీ టూ వీలర్‌కి ఇది కావాల్సిన పరికరం" అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించాడు.
0 Comments:
Post a Comment