Crow :ఆ పక్షికే పిండం ఎందుకు పెట్టాలి..? గరుడ పురాణం ఏం చెబుతోంది..?
తెలంగాణ(Telangana)లో ప్రస్తుతం 'బలగం'(Balagam) సినిమా హవా నడుస్తోంది. ఏ పల్లెలో చూసినా..ఏ పట్టణంలో చూసినా బలగం సినిమా గురించే చర్చ.
ఏ ఇద్దరూ కలిసినా కూడా బలగంలోని సన్నివేశాల గురించే మాట్లాడుకుంటున్నారు. అంతలా ప్రజలకు కనెక్ట్ అయింది ఆ సినిమా. బంధాలు, బంధుత్వాలే మన 'బలగం' అని సందేశం ఇచ్చిన ఈ సినిమాలోని భావోద్వేగాలకు ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక పోతే దర్శకుడు వేణు చివర్లో తీసుకున్న కాన్సెప్ట్ దశదిన కార్యక్రమం అందర్నీ ఏడిపించేస్తుంది. నిజంగా సినిమాలో చూపించినట్లుగా పక్షి(Crow) పిండం ముట్టుకోకపోతే చనిపోయిన వాళ్ల ఆత్మలు శాంతించవా..? దాని వల్ల ఊరికి అరిష్టం పడుతుందనే వాదనలో వాస్తవం ఎంతుంది..? గరుడ పురాణం(Garuda Puranam)ఏం చెబుతోంది..?
పిండం పక్షికి పెట్టడం అంటే ఏంటి..?
పురాణాలు, భాగవత కథలు, చరిత్రకు సంబంధించిన అంశాలు, జానపద కథలను తీసుకొని గతంలో వెండి తెరపై సినిమాలుగా రూపొందించే వారు. కాని మారుతున్న ప్రజల అభిరుచులతో పాటు సినిమాల కథలు మారుతూ వస్తున్నాయి. తాజాగా మనిషి జీవితంతో ముడిపడి ఉండే చావు..దానికి సంబంధించిన ఖర్మకాండలు, దశదినకర్మతో తెరకెక్కిన సినిమానే బలగం. కొత్త దర్శకుడు వేణు యెల్దండి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలోని దశదినఖర్మ టాపిక్‌పైనే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈసినిమాలో చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన ఆహారాలన్నింటిని కూడా వండి అతని మూడ్రోజుల ఖర్మ రోజు తర్వాత 5వరోజు చివరగా 11వ రోజున ఉంచుతారు. కానీ పక్షి మాత్రం ఆ ఆహారాన్ని ముట్టదు. ఎన్ని రకాల ఆహరం పెట్టినా.. ఎంత మంది పెట్టినా..పక్షి మాత్రం ముట్టదు. దీనితో అక్కడి వారంతా ఒక్కటై.. తమలో ఉన్న మనస్పర్ధలొ అన్నింటినీ తొలగించి అందరిచేత నైవేద్యం పెడతారు. చివరకు పక్షి వచ్చి ఆ నైవేద్యాన్ని ముడతాయి. ఇలా సినిమా కథను అల్లాడు.
గరుడపురాణం ఏం చెబుతోంది..?
బలగం సినిమాలో మెయిన్ టాపిక్‌గా తీసుకున్న పిండ ప్రధానం అంశంపై న్యూస్ 18 పూర్తి సమాచారం సేకరించే ప్రయత్నం చేసింది. కరీంనగర్ జిల్లా కాశీ విశ్వనాథ్ అనే జంగమయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గరుడ పురాణంలో మనిషి చనిపోయిన తర్వాత తన ఆత్మ ప్రేతాత్మగా మరి పక్షి రూపంలో అక్కడే అదే ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చనిపోయక మూడవ రోజు, ఐదు రోజు,11వ రోజు తర్వాత చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి స్మశాన వాటిక వద్దకు వెళ్లి మొక్కుతారు. అలా మొక్కడం వల్ల పక్షి రూపంలో మనిషి ఆత్మ వచ్చి వాటిని రుచి చూసి వెళ్తుందని ..దాని ఫలితంగా అంతా మంచి జరుగుతుందని భావన.
పల్లెటూర్లలో పాటించే సంప్రదాయం..
బలగం సినిమాలో చూపించిన సన్నివేశం తాలుకు సాంప్రదాయాలు ఎక్కువగా పల్లెటూర్లలో ఉంటుంది కాశీ విశ్వనాథ్ అనే జంగమయ్య అంటున్నారు. మనిషి చనిపోయిన 11 రోజులు పిండ ప్రధానం చేసి కాకి పెట్టడం జరుగుతుందన్నారు. ఒకవేళ మనం పెట్టిన ఆహార పదార్థాలు పక్షి ముట్టకపోతే ఎక్కడో ఏదో లోపం జరిగిందని మా ఇంట్లో ఏదో అరిష్టం జరిగిందని పల్లెటూర్లలో ఎక్కువ నమ్ముతారని అంటున్నారు. పిండం పక్షి ముట్టడం అనే కాన్సెప్ట్ తీసుకొని హాస్య నటుడు యెల్దండి వేణు తీసిన చిత్రం అందర్నీ ఆకర్షిస్తుంది ఆలోపించజేస్తోంది. నిజ జీవితంలోమనిషి చనిపోయాక జరిగే విషయాలను కళ్ళకు కట్టినట్టు చూపించి అందరిని మన్నులను పొందాడు చిత్ర దర్శకుడు వేణు.
0 Comments:
Post a Comment