నదిలో నాణేలు విసిరితే శుభవార్త(good news) వింటారని కొందరు హిందువులు నమ్ముతారు. భగవంతుని అనుగ్రహం కలుగుతుందని మరికొందరు అంటారు. నిజానికి నదిలో నాణేలు విసిరే ఆచారం ఈనాటిది కాదు.
నదుల ఒడ్డున ప్రజలు నివాసం ఉండటం ప్రారంభించిన నాటి నుంచి ఇది ఆచారంగా వస్తోంది. అప్పట్లో రాగి నాణేలు(Copper coins) చెలామణిలో ఉండేవి.
వాణిజ్యం, లావాదేవీలు రాగి నాణేలతోనే జరిగేవి. దేశంలోని కరెన్సీ రాగి నాణేల రూపంలోనే ఉండేది.
నాటిరోజుల్లో భారతదేశంలో రాగి విస్తృతంగా ఉపయోగించేవారు. ప్రజలు వంట చేయడానికి, ఆహారం తినడానికి రాగి పాత్రలను(Copper vessels) మాత్రమే ఉపయోగించారు.
రాగి స్వచ్ఛమైనదని, పవిత్రమైనదని నాటి రోజల్లో భావించేవారు. రాగిలోని ఔషద గుణాల(Medicinal properties) కారణంగా ఆ పాత్రల్లో తినడం, తాగడం వల్ల ఎన్నో రోగాలు నయమవుతాయని ఆయుర్వేదం చెబుతోంది.
ఇక నదిలో నాణేలు విసరడం విషయానికొస్తే దీనివెనుక శాస్త్రేయ కారణం కూడా ఉంది. రాగిని నీటిలో వేస్తే, అది నీటిలోని మురికిని(dirty) తొలగిస్తుందని నమ్మేవారు.
అంటే రాగి ధాతువు నీటిని శుద్ధి చేస్తుందని భావించేవారు. నదులలోని నీటిని పరిశుభ్రం(cleanliness)గా ఉంచేందుకు నాటి రోజల్లో రాగి నాణేలను నదుల్లో విసిరేవారని చెబుతుంటారు.
నాటి రోజుల్లోని నమ్మకం కారణంగా నేటికీ ప్రజలు దీనినే అనుసరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఉక్కు నాణేలు వాడుకలో ఉన్నాయి. వీటిని నీటిలో వేయడం వలన ప్రయోజనం(purpose) లేదని కొందరు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment