శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. రక్తం నుంచి వ్యర్థాలను గ్రహించడానికి, అలాగే శరీరంలోని ద్రవ స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
మీ రక్తంలోని కొన్ని వ్యర్థాలు ఎక్కువగా ఉండి, తగినంత ద్రవం లేకుంటే ఈ వ్యర్థాలు పేరుకుపోయి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతున్నాయి.
అయితే ఈ సమస్య నుంచి రక్షణకు అనేక రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
అయితే మూత్రపిండాల్లో ఉండే రాళ్లు, పరిమాణం, అలాగే వాటి వల్ల మూత్రనాళాల్లో ఏదైనా ఇబ్బంది ఏర్పడుతుందా? అనే అంశాన్ని పరిగణలోకి తీసుకునే చికిత్సలు ఉంటాయి.
ముఖ్యంగా నీరు అధికంగా తాగితే మూత్రపిండాల్లోని రాళ్లు కరుగుతాయని చెబుతూ ఉంటారు. అయితే తాజా పరిశోధనల్లో కాఫీ తరచూ తాగేవారు మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుంచి బయటపడుతున్నారని తాజా పరిశోధనల్లో తేలింది. అయితే ఆ విశేషాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
ఎక్కువగా కాఫీ తాగితే డీహైడ్రేట్ అవుతారని చాలా మంది చెబుతూ ఉంటారు. దీంతో కిడ్నీలు రాళ్ల సమస్య పెరుగుతుందని అందరూ చెబుతూ ఉంటారు. అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.
కాఫీలో ఎక్కువగా మూత్ర విసర్జన గుణాలున్నాయని, తద్వారా రాళ్లు మూత్ర నాళం ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉందని కొందరి వాదన.
కాఫీలో ఉండే కెఫెన్ వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
టీ, సోడా, కాఫీ, ఆల్కహాల్‌లో లభించే కెఫెన్ కిడ్నీల్లో రాళ్ల సమస్య నుంచి రక్షణ కల్పిస్తుందని పేర్కొంటున్నారు.
కాఫీలు తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్లు తగ్గుతాయని నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ నివేదించింది. ఇది కిడ్నీ రాళ్ల ప్రమాదాన్ని దాదాపు 40 శాతం తగ్గుతుందని తేలింది.
0 Comments:
Post a Comment