టోక్యో: సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సంచలనం చాట్‌జీపీటీ(ChatGPT). కొద్దికాలంగా ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. కొందరు దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తుంటే..
మరికొందరు దీనిని ఎలా సద్వినియోగం చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో జపాన్(Japan)కు చెందిన యోకొసుకా నగరం పాలనాపరమైన విధుల నిమిత్తం ట్రయల్ ప్రాతిపదికన దీనిని వినియోగించేందుకు సిబ్బందికి అనుమతి ఇచ్చింది.
జనాభా క్షీణత నేపథ్యంలో సిబ్బంది కొరతను భర్తీ చేసేందుకు ఈ సాంకేతికతను పరిశీలిస్తోంది.
'జనాభా క్షీణతతో ఉద్యోగుల సంఖ్య పరిమితమవుతోంది. కానీ మాకు ఎన్నో పాలనాపరమైన సవాళ్లు ఉన్నాయి.
అందుకోసం చాట్‌జీపీటీ వంటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
డాక్యుమెంట్లను రూపొందించడం, స్పెల్లింగ్‌లోని తప్పుల్ని సరిచేయడం, కొత్త ఐడియాల కోసం సిబ్బంది చాట్‌జీపీటీ(ChatGPT)ని ఉపయోగించవచ్చు' అని ఆ నగరపాలక అధికారి వెల్లడించారు.
సిబ్బంది చాట్‌జీపీటీ(ChatGPT)ని ఉపయోగించడానికి మొదట అవకాశం ఇచ్చిన నగరం యోకొసుకానే.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు చాట్‌జీపీటీపై అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. ఈ నగరం ఈ సరికొత్త సాంకేతికతను పరిశీలిస్తోంది.
సమాచార భద్రతను కారణంగా చూపుతూ.. ఇప్పటికే చైనా, రష్యా, ఇరాన్, ఉత్తరకొరియా, ఇటలీ దీనిపై నిషేధం విధించాయి. ఈ చాట్‌బాట్‌ను బ్లాక్ చేసిన మొదటి ఐరోపా దేశం ఇటలీనే కావడం గమనార్హం (Italy Bans ChatGPT)
0 Comments:
Post a Comment