ChatGPT: ఇంటర్నెట్ ప్రపంచంలో సంచలనంగా మారిన చాట్‌జీపీటీతో (ChatGPT) ప్రయోజనాలు పొందే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏఐ చాట్‌బాట్‌ను వినియోగిస్తూ డబ్బులు సంపాదించే వారు కూడా పెరుగుతున్నారు.
విద్యార్థులకు కూడా చాట్‌జీపీటీ ఒక వరంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక స్టూడెంట్ చాట్‌జీపీటీని ఉపయోగించి చదవాల్సిన సమయాన్ని తగ్గించుకున్నాడు.
దీనితో ఆ విద్యార్థి స్టడీ చేయడానికి 12 వారాలు పట్టే లెక్చర్లను 2-3 గంటల్లో పూర్తి చేసి ఎగ్జామ్‌లో 94 శాతం మార్కులు సాధించాడు.
రోజుల తరబడి చదవాల్సిన భారాన్ని తగ్గించి రెండు నుంచి మూడు గంటల్లోనే చదవాల్సిందంతా కవర్ చేయడానికి చాట్‌జీపీటీ విద్యార్థికి తోడ్పడింది. నిజానికి ఈ స్టూడెంట్ ఏ క్లాసులకు హాజరు కాలేదు.
ఒక్క క్లాస్ వీడియో కూడా చూడలేదు. కానీ చాట్‌బాట్ పుణ్యమా అని 94% స్కోర్ చేసినట్లు చెబుతూ సదరు విద్యార్థి ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాడు.
వివరాల్లోకి వెళితే.. u/151N అనే యూజర్‌నేమ్ గల రెడిట్ యూజర్ ఒక సెమిస్టర్ ఎగ్జామ్‌కి సిద్ధం కాలేదు. ఎగ్జామ్‌కి ఇంకా మూడు రోజుల సమయమే మిగిలి ఉందనగా ఆ విద్యార్థికి ఏం చేయాలో తోచలేదు.
సాధారణంగా ఆ పరీక్షలో స్కోర్ చేయాలంటే చాలా లెక్చర్లను స్టడీ చేయాలి. అందుకు సగటు విద్యార్థికి 12 గంటల సమయం పడుతుంది. అంత సమయం లేకపోవడంతో ఈ విద్యార్థి ఆలోచనలో పడ్డారు.
* చాట్‌జీపీటీ సాయం
అయితే ప్రతి లెక్చర్ Echo360లో ట్రాన్స్‌స్క్రైబ్ చేసి ఉందని ఈ స్టూడెంట్ తెలుసుకున్నాబు. ఆ ట్రాన్‌స్క్రిప్ట్స్ విశ్లేషించడానికి, పరీక్షకు సంబంధించిన అవసరమైన సమాచారాన్ని ఒక లిస్ట్‌గా రూపొందించడానికి చాట్‌జీపీటీని సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు.
ట్రాన్‌స్క్రిప్ట్స్‌లో చాలా టెక్స్ట్ ఉండగా.. దానిని విశ్లేషించే సామర్థ్యం చాట్‌జీపీటీకి లేదని అర్థం చేసుకున్నారు.
చాట్‌జీపీటీ కోసం ఆన్‌లైన్ ప్యారాఫ్రేసింగ్ టూల్‌తో ట్రాన్‌స్క్రిప్ట్‌ల టెక్స్ట్ సమ్మరైజ్ చేశాడు. ఆ టెక్స్ట్‌ను చాట్‌జీపీటీ చాట్‌బాక్స్‌లో పేస్ట్ చేసి ఉపన్యాసాలను విశ్లేషించి, పరీక్షలో అడిగే ముఖ్యమైన సమాచారాన్ని జాబితా చేయాలని అడిగాడు.
చాట్‌జీపీటీ విద్యార్థి అడిగిన ప్రకారమే పెద్ద లెక్చర్లను విశ్లేషించి ముఖ్యమైన సమాచారాన్ని మాత్రమే జాబితా రూపంలో అందించింది.
తర్వాత ఆ సమాచారాన్ని అర్థం చేసుకుని వాటిని ఎందుకు చదవాలో లిస్ట్ చేసుకున్నారు. తదుపరి రోజులో ఉపన్యాసాలలో ముఖ్యమైన అంశంగా జాబితా చేసిన ప్రతి పదాన్ని నిర్వచించమని చాట్‌జీపీటీని కోరాడు.
ఉపన్యాసాల్లోని ముఖ్యమైన అంశాలపై పూర్తి అవగాహన పొందడానికి, పరీక్షకు బాగా సిద్ధం కావడానికే విద్యార్థి ఇలా చేశాడు.
* క్రాస్ చెకింగ్
చాట్‌జీపీటీ అందించిన సమాచారం కచ్చితత్వంతో ఉందా లేదా అనే విషయాన్ని ఈ స్టూడెంట్ 4-5 గంటల పాటు చెక్ చేసుకున్నాడు. అనంతరం మూడో రోజు చాట్‌జీపీటీ సమాచారాన్ని మరింత సమ్మరైజ్ చేశాడు.
అప్పుడు క్వశ్చన్ పేపర్‌లో అడిగే సమాచారాన్ని మాత్రమే సేకరించినట్లు అయింది. మూడో రోజు వాటిని చదువుతూ గడిపాడు. చివరికి మూడు రోజుల ప్రిపరేషన్‌తో పరీక్షలో 94 % మార్కులు సాధించాడు.
విద్యార్థి ప్రకారం ఈ కోర్సు చదవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ దీనిని పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది.
ఎందుకంటే స్టడీ చేయాల్సిన ఉపన్యాసాలు చాలా ఉన్నాయట. దాంతో చాట్‌జీపీటీని ఒక ట్యూటర్‌గా తాను వాడినట్లు విద్యార్థి చెప్పాడు. ఇందులో తాను చేసిన మోసం ఏమీ లేదన్నాడు.
0 Comments:
Post a Comment