Chanakya Niti : పేదరికంలో పుట్టడం తప్పు కాదు. కానీ పేదరికంలో చావడం తప్పు. ప్రతి మనిషికి జీవితంలో ఎదగాలని ఉంటుంది.
ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ప్రతి ఒక్కరు కలలు కంటూ ఉంటారు.
కానీ పరిస్థితులే అనుకూలంగా ఉండవు. వాటిని మన వశం చేసుకోవాలి. దేన్ని అయినా శోధించి సాధించాలి. అప్పుడే అందులో ఉండే కిక్కు అర్థమవుతుంది. అంతేకానీ ఏదో సాగిపోతుందిలే అనే ధోరణి వద్దు.
పనిలో నిజాయితీ ఉంటే ఎప్పటికైనా విజయం సాధించడం సహజం. ఆచార్య చాణక్యుడు జీవితంలో ఎదగాలంటే కొన్ని చిట్కాలు చెప్పాడు.
టీంవర్క్ కే ప్రాధాన్యం
తెలివైన వాడు ఎప్పుడు కూడా ఒక్కడే ఏ పని మొదలు పెట్టడు. టీం వర్క్ కు ప్రాధాన్యం ఇస్తాడు. అందరిని కలుపుకుని చేసే పనిలో విజయం ఉంటుంది. దాని ఫలితాలు కూడా అందుకోవడం సులభం.
ఒక్కరు సాధించిన దానికి అందరు కలిసి సాధించిన దానికి పలితం వేరేలా ఉంటుంది. అందుకే టీం వర్క్ తోనే ఏ పని అయినా సాధిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆచార్య చాణక్యుడి నమ్మకం.
ఉచిత సలహాలు ఇవ్వొద్దు
ఏదైనా ఉచితంగా వస్తే దానికి విలువ ఉండదు. అలాగే ఉచిత సలహాలకు కూడా ప్రాధాన్యం ఉండదు. అందుకే అపాత్ర దానం చేయొద్దంటారు. ఉచిత సలహాలు ఇస్తే దానికి కౌంటర్ ఇస్తారు తప్ప మంచిగా తీసుకోరు.
తెలివైన వాడు తనని అడగందే ఎప్పుడు కూడా సలహాలు ఇవ్వడు. సాయం చేయడు. మనల్ని అడిగితేనే సలహాలు ఇవ్వడం మంచిది.
కష్టాలు
కష్టాలు మనుషులకే వస్తాయి. చెట్లకు గుట్టలకు కష్టాలు రావు. కష్టమొచ్చినప్పుడు కూడా ఉద్వేగానికి లోనవకుండా నిలవాలి. కష్టాలకు పరిష్కారం వెతుక్కుంటే సరిపోతుంది.
అంతేకాని నాకు కష్టమొచ్చిందని అందరికి చెప్పుకోవడం కూడా మంచిది కాదు. కష్టాల సమయంలోనే ధీరత్వం కలిగి ఉండాలి. అప్పుడే మనకు విజయాలు వరిస్తాయి. జీవితంలో ఎదిగేందుకు దోహదం అవుతుంది.
బంధువుల్లో మంచినే..
మనం ఎదుటి వ్యక్తిలో ఏది చూస్తే అదే కనబడుతుంది. మంచిని చూస్తే మంచి చెడును చూస్తే చెడు కనబడుతుంది. బంధువులను ఎప్పుడు దూరం చేసుకోవద్దు. వారితో కలిసి ఉండాలి.
వారి ప్రేమతోనే మనం ముందుకు వెళ్లాలి. అప్పుడే విజయాలు దక్కుతాయి. మన ప్రాధాన్యం పెరుగుతుంది. మనకు సమాజంలో విలువ కూడా బాగా రావడానికి కారణమవుతుంది.
చాణక్యుడు బోధించిన ఈ సత్యాలను తెలుసుకుని జీవితంలో ఎదిగేందుకు ముందుకు వెళ్లాలి. దేనికి తలవంచక నీవు అనుకున్నదే నిజం అని నమ్ముకోవాలి.
ముందడుగు వేయాలి కానీ వెనక్కి చూడకూడదు. అప్పుడే నీవు అనుకున్న పనుల్లో కచ్చితంగా విజయం సాధించి కొత్త చరిత్ర లిఖిస్తావు. ఎన్నో మైలురాళ్లు దాటుతావు.
0 Comments:
Post a Comment