Chanakya Niti: జీవితంలో జరిగే ఈ సంఘటనలు ఆర్థిక సమస్యలను సూచిస్తాయి, జాగ్రత్తగా నడుచుకోవడం ఉత్తమం..
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు.
అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.
ఆచార్య చాణక్యుడు మతం, దౌత్యం, రాజకీయాలు, విద్యలో గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం గ్రంథంలో మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా మంచి జీవితాన్ని సాగించవచ్చు. జీవితంలో విజయం గురించి ప్రస్తావిస్తూ చాణక్యుడు పలు సూచనలు అందించాడు.
జీవితంలో రాబోయే కష్టాల గురించి ముందే హెచ్చరించే సంఘటనలు జరుగుతాయని, వాటిని గుర్తించి నడుచుకోవాలని చెప్పాడు చాణక్యుడు. రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని సూచించే కొన్ని విషయాలను చాణక్యుడు తన విధానాల్లో పేర్కొన్నాడు ఆ అంశాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇవి పగలడం అశుభాన్ని సూచిస్తుంది:
ఇంట్లో అమర్చిన అద్దం, ఇతర గాజు వస్తువులు పగిలితే అది అశుభాన్ని సూచిస్తుంది. ఏ కారణం వల్ల అయినా అద్దం లేదా ఇతర గాజు వస్తువులు పగిలితే అది ఇంట్లోకి ప్రవేశించిన ప్రతికూల శక్తిని సూచిస్తుంది.
రాబోయే రోజుల్లో ఆర్థిక సమస్యలు రావొచ్చని దీంతో గమనించవచ్చు. అలాగే గాజు, అద్దం పగిలితే వెంటనే దానిని తీసివేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పగిలిన ముక్కను అద్దంలా వాడకూడదని చెప్పాడు చాణక్యుడు. వీలైనంత త్వరగా వాటి స్థానంలో కొత్తవి తీసుకురావాలన్నాడు ఆచార్యుడు.
రోజూ ఇలా జరిగితే లక్ష్మీ దేవికి కోపం వస్తుంది:
ఎప్పుడూ గొడవలు జరిగే ఇంట్లో నివసించాలని ఎవరూ కోరుకోరు. బయట ఎంత కష్టపడ్డా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఎంత ఒత్తిడి భరించినా.. ఇంటికి రాగానే ప్రశాంతంగా అనిపించాలి. అప్పుడే అది ఇల్లు అనిపించుకుంటుంది.
అలా కాకుండా నిత్యం ఏదో ఒక గొడవ జరిగే ఇంట్లో, ప్రశాంతత లేని ఇంట్లో ఉండాలని ఎవరూ కోరుకోరు. అలాంటి ఇంట్లో ఉండటానికి లక్ష్మీ దేవి కూడా ఇష్టపడదని చాణక్యుడు చెప్పాడు. అలాంటి ప్రతికూల ఇంటి నుండి లక్ష్మీ దేవి వెళ్లిపోతుందని చెప్పాడు ఆచార్యుడు. ఈ ఒక్క సూచనతో రాబోయే కాలంలో ఆర్థిక సమస్యలు వస్తాయని గుర్తించవచ్చని ఆచార్యుడు చెప్పుకొచ్చాడు.
ఇది చేయని ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు:
ఇల్లు అంటే అన్ని రకాలుగా పరిపూర్ణంగా ఉండాలి. సంబంధాలు, మాటలు, కేరింతలు, వేడుకలు, పూజాది కార్యక్రమాలు జరుగుతుండాలి. అప్పుడే ఆ ఇల్లు నందనవనంలా ఉంటుంది.
రోజువారీ పూజలు చేయని ఇంట్లో ఉండటానికి లక్ష్మీ దేవి ఇష్టపడదని చాణక్యుడు చెప్పాడు. అలాంటి ఇంట్లో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుందన్నాడు. అలాంటి చోట పేదరికం పెరుగుతుందని చెప్పాడు ఆచార్యుడు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.
0 Comments:
Post a Comment