Chaddannam For Breakfast : పొద్దున్నే చద్దన్నం తింటే.. చెప్పలేనంత ఆరోగ్యం!
బ్రేక్ ఫాస్ట్ చేయడమంటే.. చాలా మందికి బద్ధకం. కొంతమంది డైరెక్ట్ లంచ్ చేసేస్తా సరిపోతుందిలే అనుకుంటారు. మరికొందరేమో.. ఏదో ఒకటి కడుపులో పడేస్తే..
అలా ఉంటుంది కదా అంటారు. కానీ ఏది పడితే అది తింటే.. అనారోగ్యం పాలవుతారు. ఒక్కసారి ఆలోచించండి.. మన పెద్దలు చద్దన్నం తిని.. ఎంత ఆరోగ్యంగా ఉండేవారు. వ్యాధులు కూడా వచ్చేవి కావు. మనం తినే ఆహారమే.. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే అల్పాహారం సరిగా తీసుకోవాలి.
మనం ఉదయంపూట తినే ఆహారమే.. రోజంతా ఎలా ఉంటామో డిసైడ్ చేస్తుంది. అందుకే నిపుణులు కూడా కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ చేయండి అని చెబుతారు. మార్నింగ్ తినే ఆహారంలో ఎన్ని పోషకాలు ఉంటే.. అంత మంచిది. ఉదయం తినే ఆహారంలో పోషకాలు ఉండాలంటే.. చద్దన్నంలాంటివి ట్రై చేయండి.
దీనికోసం రాత్రిపూట అన్నం కొద్దిగా ఎక్కువగా వండుకోవాలి. అందులో పాలు పోయాల్సి ఉంటుంది. అనంతరం తోడు పెట్టాలి. దీంతో రాత్రికి రాత్రి అది పులుస్తుంది. ఉదయం వరకు చద్దన్నంగా తయారవుతుంది. అయితే రాత్రి మట్టి కుండలో ఉంచితే ఇంకా మంచిది. ఉదయం వరకు టేస్టీగా అవుతుంది. ఇలా తయారైన చద్దన్నం మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లాగా తీసుకోండి. అందులో నిమ్మకాయ రసం పిండి.. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలతో కలిపి తినొచ్చు.
చద్దన్నంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అనేక పోషకాలు మీకు లభిస్తాయి. ఇందులో కార్బొహైడ్రేట్లు, మెగ్నిషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం సమృద్ధిగా దొరుకుతాయి. శరీరానికి శక్తి వస్తుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. రోజంతా పనిచేయడానికి కావల్సిన శక్తి వస్తుంది. నీరసం, నిస్సత్తువ తగ్గి చురుగ్గా పని చేస్తారు. చద్దన్నంతో మన జీర్ణవ్యవస్థకు అవసరం అయ్యే.. మంచి బాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుంచి బయటపడొచ్చు.
ఇది తింటే.. అల్సర్ తగ్గుతుంది. పొటాషియం అధికంగా ఉంటుంది. హైబీపీని తగ్గిస్తుంది. రక్తసరఫరాను మెరుగు పరుస్తుంది. గుండె ఆరోగ్యం కూడా సరిగా అవుతుంది. ఎవరికైనా శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే.. చద్దన్నం తింటే.. ఉపశమనం ఉంటుంది. వేసవిలో అయితే చద్దన్నం ఇంకా మంచిది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
0 Comments:
Post a Comment