Cars: ఇకపై ఈ కార్లు హిస్టరీ.. ఆల్టో 800 నుంచి ఇన్నోవా క్రిస్టా వరకు అన్ని కార్లు బంద్..
మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని కార్లకు భారీ సంఖ్యలో అభిమానులున్నారు. ఆయా కంపెనీల నుంచి విడుదలైన కొన్ని కార్లు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గానే ఉన్నాయి.
అయితే ఇకపై ఆ పేరొందిన కార్లు కేవలం హిస్టరీగానే మిగిలిపోనున్నాయి. రాబోయే రోజుల్లో మార్కెట్ లో ఈ కార్లు లభించవు. ఏఏ కార్లను సంస్థలు నిలిపివేశాయో ఆ వివరాలు మీకోసం..
ఏప్రిల్ 1 నుంచి నూతన ఉద్గార నియమాలు BS6 ఫేస్-2, (RDE)నిబంధల్నీ అమలులోకి కేంద్ర తీసుకువచ్చింది. అందులో భాగంగా ఇకపై విడుదల చేయబోయే కార్లను ఆటో కంపెనీలు కచ్చితంగా అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. వీటి ఖర్చును భరించలేక కంపెనీలు కొన్ని కార్ల ఉత్పత్తిని నిలిపివేయనున్నాయి. నూతనంగా విడుదల చేయబోవు కార్ల ధరల్నీ కూడా పెంచేశాయి. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచే అందుబాటులోకి వచ్చాయి.
Maruti Alto 800:
దేశంలోని సామాన్యులు అంత్యంత అమింతగా ప్రేమించే ఆల్టో కారు ఉత్పత్తిని మారుతి సుజుకి నిలిపివేసింది. RDE నియమాలను కచ్చితం చేయడంతో వీటి యూనిట్లను నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ కారుకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. తాజా నిర్ణయంతో వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.
Tata Altroz Diesel & Nissan Kicks:
ఇకపై ఉత్పత్తి నిలిపివేయనున్న కార్లలో టాటా ఆల్ట్రోజ్ డీజిల్ వెర్షన్ కూడా ఉంది. ఫీచర్ల పరంగా అందుబాటు ధరలో ఈ కారు ఉంది. దీనిని కూడా ఆ కంపెనీ నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ జాబితలో ఉన్న మరో కారు నిస్సాన్ కిక్స్. కొత్త నియమాలకు తట్టుకోలేక ఈ జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ కిక్స్ మోడల్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ఈ కారును కొనుగోలు చేయలేరు..
Honda City 4th Generation & Honda WR-V:
కేంద్రం తీసుకువచ్చిన నిబంధనలు కచ్చితం చేయడంతో వాటికి అనుగుణంగా కార్లను అప్‌డేట్ చేయడం కారు కంపెనీలకు సాధ్యం కాదు. దీంతో వాటిని నిలిపివేయడమే బెటర్ అనుకుని ఈ నిర్ణయం తీసుకున్నాయి. జపాన్‌కు చెందిన మరో ఆటో కంపెనీ హోండా కూడా కొన్ని కార్ల విక్రయాలను నిలిపివేస్తోంది. వాటిలో హోండా సిటీ 4th జనరేషన్ మోడల్ కూడా ఉంది. రాబోయే కాలంలో హోండా VR-Vని కొనుగోలుకి అందుబాటులో ఉండదు.
Mahindra Marazzo, Mahindra KUV 100 & Mahindra Alturas G4:
నూతన RDE నిబంధనలతో ఆటో మోబైల్ పై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. మహీంద్రా నుంచి Marazzo మోడల్ ను ఆ సంస్థ నిలిపివేసింది. ఇదే కంపనీ నుంచి వచ్చిన మహీంద్రా KUV100, BS6 ఫేజ్ 2 నిబంధనల కారణంగా నిలిచిపోనుంది. ప్యూచర్ లో ఈ కారు అందుబాటులోకి రాదు. మహీంద్రా నుంచి వచ్చిన మరో కారు అల్టురాస్ G4 కారు కూడా ఉంది.
Renault KWID & Skoda Octavia:
చిన్న కార్లు కొనుగోలు చేయాల్సిన వారు కచ్చితంగా రెనాల్ట్ కారు వైపు చూస్తారు. ఇది బాగా ప్రసిద్ధి చెందింది. మార్కెట్‌లో రెనాల్ట్ క్విడ్ ఇప్పటికి మంచి డిమాండ్ ఉంది. సరసమైన ధర రూ.4.70 లక్షలకు ఈ కారు లభించనుంది. కానీ ఇకపై ఈ కారు హిస్టరీ గానే మిగిలిపోనుంది. ఈ జాబితాలో యూరోపియన్ కు చెందిన మరో కారు స్కోడా ఆక్టావియా సెడాన్. ఈ కారు ఏప్రిల్ నుంచి లభించదు.
Hyundai Verna( Diesel), I20 (Diesel) & Innova Crysta (Petrol):
హ్యూందాయ్ నుంచి బాగా పేరొందిన వెర్నా(డీజిల్) పాటు ఐ10 (డీజిల్) వెర్షన్ కార్లను ఆ సంస్థ నిలిపివేయనుంది. అలానే ఇన్నోవా క్రిస్టా (పెట్రోల్) వెర్షన్ కారు ఇకపై మార్కెట్ లో కనిపించదు. మొత్తానికి ఆయా కంపెనీలు వీటిని నిలిపివేస్తూనే కొత్తగా అధునాతన ఫీచర్లతో కార్లను తీసుకువస్తున్నాయి. అందులో భాగంగా ధరలు కూడా అదనంగా ఉండనున్నాయి.
0 Comments:
Post a Comment