పరిమళాల కొవ్వొత్తుల చీకట్లని తొలగించడమే కాదు, మానసిక ఆరోగ్యాన్ని చేకూర్చి... ప్రశాంతతనూ అందిస్తాయి..
వీటిలో ఉండే కొన్ని రకాల పరిమళాలు మెదడులోని లింబిక్ వ్యవస్థను ప్రేరేపించి సెరటోనిన్, డోపమిన్ వంటి హ్యాపీ హార్మోనుల్ని విడుదల చేస్తాయి.
ఇవి మనసు ఉల్లాసంగా ఉంచేందుకు దోహదం చేస్తాయి. ముఖ్యంగా లావెండర్, లెమన్, వెనిల్లా వంటి పరిమళాలు కుంగుబాటుని తగ్గిస్తాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
ఒత్తిడి తగ్గిస్తాయి..
ఒత్తిడి, ఆందోళనల నుంచి మనసుకి ఉపశమనాన్నిస్తాయి. మల్లె పరిమళం నరాలకు సాంత్వన కలిగించి రక్తపోటు, గుండె వేగాన్ని తగ్గిస్తుంది.
శారీరక శ్రమతోనో, మానసిక ఆలోచనలతోనో ఒత్తిడిగా అనిపించినప్పుడు కాసేపు ఈ అరోమాను పీల్చుకుంటే సరి...ఎంతో హాయిగా ఉంటుంది.
యూకలిఫ్టస్, పెప్పర్‌మింట్, చందన పరిమళాలిచ్చే కొవ్వొత్తులు ఈ విషయంలో మంచి ఫలితాలను ఇస్తాయి.
నిద్రలేమి దూరం..
మానసిక ఆరోగ్యం బాగుండాలంటే మంచి నిద్ర తప్పనిసరి. ఇప్పుడు చాలా మందికి ఇది ఒక కల. ఈ ఇబ్బంది ఉన్నప్పుడు నిద్రపోయే ముందు గదిలో పరిమళాల కొవ్వొత్తిని వెలిగించి చూడండి. హాయిగా నిద్రలోకి జారుకుంటారు.
0 Comments:
Post a Comment