Toor Dal Seed Coat For Calcium: కాల్షియం శరీరానికి అత్యంత అవసరమైన పోషకం. ఇది ఎముకలను, దంతాలను దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
అయితే ప్రస్తుతం చాలా మంది కాల్షియం లోపం సమస్యలతో బాధపడుతున్నారు. దీని వల్ల రక్తం గడ్డకట్టడం, కండరాలను బలోపేతం సమస్యలు వస్తున్నాయి.
అంతేకాకుండా చాలా మందిలో ఎముకల, దంతాల బలహీనత సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాంతకంగానూ మారే ఛాన్స్ కూడా ఉంది.
పాల కంటే ఇందులో ఎక్కువ కాల్షియం లభిస్తుంది:
పాలలో కాల్షియం అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి కాల్షియం సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా తాగమని వైద్యులు సూచిస్తారు.
అయితే పాలలో కాకుండా కంది పప్పులో కూడా కాల్షియం అధిక పరిమాణంలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి ఈ లోపం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఆహారంలో ఈ పప్పులను తీసుకుంటే చాలా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) నివేదికల ప్రకారం..ప్రతి రోజూ తీసుకునే పాల 6 రెట్లు ఎక్కువ కాల్షియం కందిపప్పులో ఉంటుంది.
ఇది బోలు ఎముకల వ్యాధి నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
బేబీ ఫుడ్‌లో తప్పకుండా కంది పప్పును తీసుకుంటే పిల్లల ఎముకలు దృఢంగా మారతాయి. 100 గ్రాముల కందిపప్పులో 652 mg కాల్షియం ఉంటుంది.
కాబట్టి ప్రతి రోజూ ఈ పప్పును తినడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి.
0 Comments:
Post a Comment