దేశంలో చాలా మంది రైతులు ఇప్పటికీ సాంప్రదాయ వ్యవసాయంతో ముడిపడి ఉన్నారు, అయితే కొంతమంది రైతులు సాంప్రదాయ వ్యవసాయానికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు.
తెల్ల చందనం సాగు దక్షిణ భారత్ దేశంలోనే కాదు.. చాలా చోట్ల సాధ్యమవుతుంది.
రైతులు తమ భూముల్లో తెల్ల చందనం నాటడం ద్వారా కేవలం 12 సంవత్సరాలలో కోటీశ్వరులు అవుతారట.
ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషదాలలో శ్రీగంధం ఒకటి. శ్రీ గంధం మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉండటం వల్ల ఈ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
ఈ మొక్కను సౌందర్య ఉత్పత్తులు, అగరబత్తులు, వివిధ రకాల పర్ఫ్యూమ్ లలో ఎంత విరివిగా ఉపయోగిస్తారు. దీంతో రైతులు శ్రీగంధం సాగుకు మొగ్గు చూపుతున్నారు.
శ్రీ గంధం మొక్కలు నాటడానికి సారవంతమైన సేంద్రియ పదార్థాలు కలిగినటువంటి అన్ని నేలలు ఎంతో అనుకూలమని చెప్పవచ్చు. నీరు నిలువని ఒండ్రు నేలలు, ఇసుక నేలల్లో కూడా ఈ మొక్కలు పెంచవచ్చు.
మురుగునీరు పారుదల తప్పనిసరిగా ఉండాలి. అనుకూలతలు కలిగిన నేలల్లో శ్రీగంధం సాగు చేయడం వల్ల అధిక లాభాలను పొందవచ్చు.
ప్రపంచ కలప వృక్షాలలో రారాజుగా వెలుగొందుతున్న శ్రీ గంధం మొక్క సాంటాలేసీ కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం శాంటాలమ్ ఆల్బమ్.
దీనిని ఇంగ్లీష్ లో శాండిల్ వుడ్ (sandalwood) అంటారు. ఈ మొక్క విచిత్ర లక్షణం వేరే మొక్క వేర్ల పై ఆధారపడి పోషక విలువలను గ్రహించి మనుగడ సాగిస్తుంది.
ఈ మొక్కను ప్రాంతీయంగా శ్రీగంధము లేదా చందనము అని పిలుస్తారు.శ్రీ గంధము మొక్క సహజంగా సతత హరిత అరణ్యల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఈ మొక్క దాదాపు 4మీ. నుంచి 9మీ.ఎత్తు వరకు పెరుగుతుంది.
శ్రీగంధం మొక్కను ప్రస్తుతం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కేరళ , మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ , ఒరిస్సా, బీహార్ వంటి రాష్ట్రాల్లో రైతులు అత్యధికంగా సాగు చేస్తున్నారనీ గణాంకాలు చెబుతున్నాయి.
0 Comments:
Post a Comment