Business Ideas: జస్ట్ రూ.2 లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారం చేస్తే.. రోజుకు రూ.5 వేలు పక్కా..!
డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మనం కష్టపడి సంపాదించిన డబ్బుకు విలువ ఉంటుంది. అది మనం జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగడానికి దోహదపడుతుంది.
కష్టపడి పనిచేయాలి కానీ…మనకు మనమే రాజులం. చాలా మందికి ఉద్యోగాలు చేయాలని ఉంటుంది. మరికొందరికి ఒకరి కింద పనిచేయడం ఇష్టం ఉండదు. తానే పదిమందికి ఉపాధి కల్పించాలన్న ఆశయం ఉంటుంది. అలాంటి వారే వ్యాపారాల్లో రాణిస్తున్నారు. బిజినెస్ చేస్తే డబ్బు సంపాదించడం కూడా అంత తేలిక కాదు. కష్టపడాల్సిందే. అయితే ఎలాంటి బిజినెస్ ఎంచుకుంటే నష్టాలు రాకుండా లాభాలు వస్తాయో ముందుగా తెలుసుకోవాలి. పెట్టుబడి ఎంత, ఆదాయం ఎంత..ఈ సమాచారం ముందుగా తెలుసుకోవాలి. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువగా ఉండే వ్యాపారాలవైపు మొగ్గు చూపాలి.
కేంద్రంలో మోదీ సర్కార్ ఇప్పుడు యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశ్యంతో అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగానే ముద్ర స్కీం ద్వారా దేశవ్యాప్తంగా అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది. సొంతంగా వ్యాపారం ప్రారంభించేందుకు, ఇప్పటికే వ్యాపారాన్నిప్రారంభించినట్లయితే దాన్ని డెవలప్ చేసుకునేందుకు ఈ ముద్ర రుణాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ స్కీం ద్వారా రూ. 50వేల నుంచి రూ. 10 లక్షల వరకు రుణాలను పొందే ఛాన్స్ ఉంది.
ఇఫ్పుడు ఏ వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా. ఫుడ్ బిజినెస్ చక్కటి వ్యాపారం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ బిజినెస్ కు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. మంచి ఆదాయం పొందే అవకాశమూ ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది చిరుతిళ్లకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో ఈ బిజినెస్ లు మంచి లాభాలు ఉంటాయి. ఇళ్లలో తయారు చేసుకోవడం తక్కువైంది. ఏది కావాలన్నా నిమిషంలో ఆర్డర్ చేస్తే చాలు ఇంటి ముందు ఉంటన్నాయి. అంతేకాదు చిన్నపిల్లలు చిరుతిళ్లు కావాలని మారం చేస్తుంటే బయట నుంచి కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడుతోంది. దీన్నే మీరు గొప్ప వ్యాపారంగా మలుచుకుంటే ఎలా ఉంటుంది.
హాట్ చిప్స్ పేరుతో ఆలుగడ్డ, అరటి కాయతో చిప్స్ తయారు చేస్తే చక్కటి ఆదాయం పొందవచ్చు. పిల్లలు, పెద్దలు అన్ని వయస్సుల వారు ఇష్టపడితింటుంటారు. ప్రస్తుతం మార్కెట్లో బడా కార్పొరెట్ సంస్థలు పెప్సీ సహా ఇతర కార్పొరేట్ సంస్థలు ఈ హాట్ చిప్స్ రంగంలో మంచి లాభాలను గడిస్తున్నాయి. మీరు కూడా మీ స్వస్థలంలోనే హాట్ చిప్స్ తయారు చేయడం ద్వారా మంచి ఆదాయం పొందే వీలుంది.
హాట్ చిప్స్ వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఒక షాపు అద్దెకు తీసుకోవాలి. రద్దీగా ఉన్నప్రాంతాలైతే మీ షాప్ తొందరగా క్లిక్ అవుతుంది. ముఖ్యంగా షాపును వినియోగదారులను ఆకట్టుకునేలా డిజైన్ చేయించాలి. షాప్ ముందే తాజాగా చిప్స్ తయారు చేస్తుండాలి. దాని కోసం ఒక బాణాలి కొనుగోలు చేయాలి. ఆలుగడ్డలు హోల్ సెల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తే తక్కువ ధరకు లభ్యం అవుతాయి. చిప్స్ తయారు చేయడంలో నూనె కీలక పాత్ర పోషిస్తుంది. నూనె మంచి బ్రాండ్ తీసుకోవాలి. ఎందుకంటే నూనె క్వాలిటీ బాగుంటేనే చిప్స్ బాగుంటాయి. లేదంటే దుర్వాసన వస్తుంది. క్వాలిటీ తగ్గుతుంది. కస్టమర్లు ఒకసారి మరోసారి వచ్చేలా చూడాలి. అందుకే క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదు. హాట్ చిప్స్ తోపాటు స్వీట్లు కూడా తయారు చేసి పెట్టాలి. వీటితో కూడా అదనంగా ఆదాయం సంపాదించవచ్చు. ఈ వ్యాపారానికి రెండు లక్షల ఖర్చు అవుతుంది. ప్రతినెల మీరు సుమారు రూ.50వేలు సంపాదించే అవకాశం ఉంది.
0 Comments:
Post a Comment