BSF Recruitment 2023: నిరుద్యోగులకు అలర్ట్.. బీఎస్ఎఫ్ లో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి .
నిరుద్యోగులకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది.
హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 247 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 247 పోస్టులలో, 217 పోస్టులు హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) మరియు 30 పోస్టులు హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) ఖాళీలు ఉన్నాయి. రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తును ఆన్‌లైన్ మోడ్‌లో సమర్పించాల్సి ఉంటుంది. అప్లికేషన్ లింక్ ఏప్రిల్ 22 నుండి యాక్టివేట్ చేయబడుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 12ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
విద్యార్హతల వివరాలు:
ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లో 12వ తరగతిలో 60 శాతానికి పైగా మార్కులు సాధించిన వారు అప్లై చేసుకోవచ్చు. లేదా ఐటీఐ శిక్షణతో పాటు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు సడలింపు ఇవ్వబడుతుంది. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి:
దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు అధికారిక సైట్ rectt.bsf.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది. మొదట రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. తర్వాత, దరఖాస్తు ఫారమ్ నింపాలి. ఈ నెల 22వ తేదీ నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
0 Comments:
Post a Comment