త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్.. గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
సాక్షి, విజయవాడ: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీల పై సమీక్షించాం. త్వరలో బదిలీల పై నిర్ణయం తీసుకుంటాం. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తాం. ఇందు కోసం ఇతర రాష్ట్రాలలోని అంశాలను కూడా పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో బాధ్యతారాహిత్యంగా కొందరు మాట్లాడారు. నేను ముందే చెప్పాను. ఈ రోజు బిడ్డింగ్‌తో ఆ విషయం స్పష్టమయింది. మేము చాలా స్పష్టంగా స్టీల్ ప్లాంట్ కేంద్రం ఆధీనంలోనే ఉండాలని చెప్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం.’’ అని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
0 Comments:
Post a Comment