*📚✍️రెండో తరగతి వరకు రాత పరీక్షలొద్దు
♦️వాటితో విద్యార్థులపై అదనపు భారం
♦️జాతీయ పాఠ్యాంశ ప్రణాళిక ముసాయిదా సిఫారసు
*🌻న్యూఢిల్లీ, ఏప్రిల్ 7:* రెండో తరగతిలోపు విద్యార్థులపై అదనపు భారం తగ్గించే దిశగా జాతీయ పాఠ్యాంశ ప్రణాళిక (ఎన్సీఎఫ్) ముసాయిదా కీలక సిఫారసు చేసింది. ప్రత్యక్ష పరీక్షలు, రాతపరీక్షలు రెండో తరగతిలోపు పిల్లలపై అదనపు భారాన్ని మోపుతున్నాయని, కాబట్టి వారికి అలాంటి మూల్యాంకన పద్ధతులను తీసివేయాలని సూచించింది. మూడో తరగతి నుంచి రాత పరీక్షలు ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది. ఇస్రో మాజీ చీఫ్ కె కస్తూరి రంగన్ నేతృత్వంలోని కమిటీ పాఠ శాల విద్యకోసం రూపొందించిన 'ప్రీ-డ్రాఫ్ట్ 'ను విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యారంగ నిపుణుల నుంచి సలహాలు ఆహ్వానించింది. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఎస్ఈపీ) ప్రకారం ఎన్సీఎఫ్ అభివృద్ధి చేస్తున్న ఈ ఫ్రేమ్వర్క్.. విద్యార్థి పునాది దశకు అవ సరమైన రెండు ముఖ్యమైన మూల్యాంకన పద్ధతులు, ప్రాథమిక స్థాయిలో పిల్లల అంచనా, అభ్యసన సమయంలో వారు రూపొందించిన మెటీరియల్ విశ్లేషణ ముఖ్యమైనవని పేర్కొంది. ముసాయిదాలో సన్నాహక దశ (3 నుంచి 5వ తరగతి వరకు)ను వివరిస్తూ.. 'ఈ దశలో రాత పరీక్షలు ప్రవేశపెట్టాలి' అని సిఫారసు చేసింది. అభ్యసనాన్ని ప్రోత్సహించేందుకు వివిధ రకాల మూల్యాంకన పద్ధతులను వినియోగించాలని తెలిపింది. విద్యార్థుల పురోగతిని వారి పని ద్వారా గుర్తించడా నికి పోర్ట్ఫోలియోలను ఉపయోగించవచ్చని, సన్నాహక దశ ముగిశాక అనేక కొత్త పాఠ్యాంశాలను ప్రవేశపెట్టే మాధ్యమిక దశలోకి ప్రవేశించడానికి విద్యార్థి సంసిద్ధ తకు సమగ్ర సమ్మేటివ్ మదింపు ఉండాలని సూచించింది. 6 నుంచి 8వ తరగతి వరకు పాఠ్యాంశాల దృష్టి భావనాత్మక అవగాహన, ఉన్నత శ్రేణి సామర్థ్యాల వైపు ఉండాలని తెలిపింది. ఇక సెకండరీ దశ (9 నుంచి 12వ తరగతి) లో అర్థవంత మైన అభ్యసన, నిర్మాణాత్మక ఫీడ్బ్యాక్ కోసం తరగతి మూల్యాంకనాలను సమర్థ వంతంగా నిర్వహించాలని పేర్కొంది. కాగా, వచ్చే ఏడాది నుంచి నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం పాఠ్యపుస్తకాలను ప్రవేశపెడతామని కేంద్రం తెలిపింది.
0 Comments:
Post a Comment