బ్రెడ్ ప్యాకెట్(packet of bread)లో పైన, కిందున ఉండే బ్రెడ్ ముక్కలు మిగిలిన వాటికన్నా ఎందుకు భిన్నంగా(differently) ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
దీని వెనుక గల కారణాన్ని, వాటిని తినవచ్చో లేదో అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెడ్ ప్యాకెట్ పైభాగంలో ముక్క భిన్నంగా ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు.
దాని ప్రత్యేక ఆకారం(Special shape) కారణంగా చాలామంది ఈ ముక్కలను తినకూడదని, పారవేయాలని భావిస్తారు.
అయితే ఆ ముక్క అలా ఉండటానికి కారణం బ్రెడ్ తయారీ ప్రక్రియ(Bread making process). బ్రెడ్‌ను పెద్ద సైజు అచ్చులో తయారు చేసిన తర్వాత, దానిని సన్నని ముక్కలుగా కట్ చేస్తారు.
దీనిని బేకింగ్(Baking) చేసినప్పుడు పైభాగం, అచ్చుతో సంబంధం కలిగి ఉంటుంది.
దీంతో ఇది కొద్దిగా గట్టిగా మారుతుంది. బ్రెడ్‌ను సన్నని ముక్కలుగా కట్ చేసినప్పుడు, గట్టి భాగం ఎగువ దిగువ భాగాలలోకి చేరి ప్యాక్ అవుతుంది.
ఈ హార్డ్ బ్రెడ్ ముక్కలు(Hard bread crumbs) మధ్యలో ఉన్న ముక్కలను రక్షిస్తాయి. ఈ హార్డ్ బ్రెడ్ తేమను(Moisture) గ్రహించడం ద్వారా ఫంగస్ నుండి లోపలి ముక్కలను రక్షిస్తుంది.
ఈ హార్డ్ బ్రెడ్ ముక్కలలో మిగిలినవాటి కన్నా అధికంగా ఫైబర్(Fiber) ఉంటుంది. దీనిని నిరభ్యంతరంగా తినవచ్చని నిపుణులు(Experts) చెబుతుంటారు.
0 Comments:
Post a Comment