రాయచోటి టౌన్ (కడప); స్థానిక మాసాపేట జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి పరీక్షకు హాజరైన ఓ విద్యార్థి పరీక్ష అనంతరం ఆన్సర్‌షీట్‌ను ఇవ్వకుండా ఇంటికి తీసుకెళ్లి కాల్చివేశాడు.
ఈ సంఘటనకు బాధ్యులైన ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి.
రాయచోటికి చెందిన విద్యార్థి డైట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. మాసాపేట కేంద్రంలోని పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష అనంతరం ఆన్సర్‌షీట్‌ను ఇన్విజిలేటర్‌లకు ఇవ్వకుండా ఇంటికి తీసుకెళ్లి కాల్చివేశాడు. విద్యార్థులు వెళ్లిపోయాక పరీక్షకు హాజరైన విద్యార్థులు, ఆన్సర్‌షీట్‌లను లెక్కించిన పరీక్ష సిబ్బంది ఒకటి తక్కువగా ఉందని విద్యార్థులను విచారించారు.
తాను ఆన్సర్‌షీట్‌ను తీసుకెళ్లి కాల్చివేసినట్లు ఆ విద్యార్థి ఒప్పుకున్నాడు. దీంతో ఆ విద్యార్థిని మాల్‌ప్రాక్టీస్ కింద డిబార్ చేయడంతో పాటు ఉన్నత విద్యాశాఖాధికారులకు సమాచారం అందించారు.
0 Comments:
Post a Comment