డాలర్, యూరో కంటే కూడా ఖరీదైన శ్రీ రాముడు ఫోటో కరెన్సీనా... అని ఆశ్చర్య పోతున్నారా? విషయం తెలియాలంటే ఈ పూర్తి కధనం చదవండి. మీరు బల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ గురించి ఎపుడైనా విన్నారా?
భూమి లేని దేశంగా పిలవబడుతున్న ఆ బల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ కరెన్సీ డాలర్, యూరో కంటే బలమైన కరెన్సీ అని అంటున్నారు.
మరి నిజంగా ఈ కరెన్సీకి అంత విలువుందా? మహర్షి మహేశ్ యోగి 2020 అక్టోబర్ 7న స్థాపించిన దీని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం రండి.
సరహద్దులనే వాటితో సంబంధం లేకుండా, ప్రపంచం నలుమూలల నుండి శాంతియుత, సామరస్యపూర్వక వ్యక్తులను ఒకచోట కలిపేదే గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్. దీనిని కొంతమంది ప్రత్యేకమైన దేశంగా పిలుస్తున్నారు.
మహర్షి గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్కి మహర్షి మహేశ్ యోగి మరణానంతరం ప్రస్తుతం న్యూరాలజిస్ట్, అధినేత రాజా రామ్ (టోనీ నాడార్) అధినేతగా ఉన్నారు. ఇక్కడ స్వంత కరెన్సీని 'రామ్' అని పిలుస్తారు. ఇది లోకల్ కరెన్సీ. దీన్నే బేరర్ బాండ్ అని కూడా పిలుస్తున్నారు.
దీనిని అయోవా, నెదర్లాండ్స్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఐరోపాలో 10 యూరోలు, అమెరికా 10 డాలర్లకు ఈ 'రామ్' కరెన్సీ సమానం అని అంటున్నారు. ఇప్పటికే ఉన్న కరెన్సీలను ఇది భర్తీ చేయదు కానీ నిర్దిష్ట లావాదేవీల కోసం అయితే వాడుకోవచ్చట.
అదేవిధంగా రామ్ను బ్యాకప్ చేయడానికి బంగారాన్ని ఉపయోగించుకోవచ్చని ఆ సంస్థ చెబుతోంది. 2001లో మహర్షి మహేష్ యోగి జారీ చేసిన ఈ కరెన్సీని డచ్ సెంట్రల్ బ్యాంక్ అనుమతించడం విశేషం.
అమెరికాలోని పలు నగరాల్లో నిర్మించిన ఈ "శాంతి భవనాలు" దేవాలయాలను పోలిఉంటాయి. ఇక్కడ ఆయుర్వేద చికిత్సలు, మూలికా సప్లిమెంట్లు, అతీంద్రియ ధ్యానం వంటి వాటిపై బోధిస్తారు.
0 Comments:
Post a Comment