భారతీయ కరెన్సీ నోట్లపై( Indian Currency Notes ) దేశంలోని గొప్ప సాంస్కృతిక, చారిత్రక, వారసత్వ ల్యాండ్మార్క్లు, నిర్మాణాల చిత్రాలు ఉంటాయి. వీటిని మీరు గమనించే ఉంటారు.
అయితే ఈ ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అందరికీ తెలియకపోవచ్చు. కాగా ఒక ట్విట్టర్ యూజర్ ఇండియన్ కరెన్సీ నోట్లపై ముద్రించిన ఈ చారిత్రక ప్రదేశాలు( Historical Sites ) ఎక్కడున్నాయో ఫొటోలతో సహా వెల్లడించారు. ఒక ట్వీట్ థ్రెడ్ చేసి అతను నోట్లపై ముద్రించిన అందమైన ప్రదేశాల గురించి తెలిపారు.
ఈ ప్రదేశాలలో ఒడిశాలోని కోణార్క్ ఆలయం,( Konark Temple ) కర్ణాటకలోని హంపి రాతి రథం, మధ్యప్రదేశ్లోని సాంచి స్థూపం, ఢిల్లీలోని లాల్ ఖిలా, ఎల్లోరాలోని కైలాష్ ఆలయం ఉన్నాయి.
కరెన్సీ నోట్లపై గుజరాత్లోని మెట్ల బావి రాణి కి వావ్, భారతదేశం మొట్టమొదటి విజయవంతమైన మార్స్ మిషన్ మంగళయాన్ కూడా ప్రచురించడం జరుగుతుంది.
ఈ చిత్రాలు భారతదేశం గొప్ప సాంస్కృతిక గతాన్ని, దేశ చరిత్రను గుర్తు చేస్తాయి.
అలానే ఆ సైట్ల ప్రాముఖ్యతను గుర్తు చేస్తాయి. ఉదాహరణకు, కోణార్క్ సూర్య దేవాలయం ఒడిషాలోని 13వ శతాబ్దపు దేవాలయం.
సూర్య భగవానుడి కోసమే ఈ దేవాలయం భారతదేశంలో నిర్మితమైంది. ఇది రూ.10 నోటుపై కనిపిస్తుంది.
ఇక ఒకే రాతితో చెక్కిన హంపి రాతి రథం భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం.
దీనిని రూ.50 నోటుపై చూడవచ్చు. రూ.200 నోటుపై యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన సాంచి స్థూపం, రూ.500 నోటుపై ఢిల్లీలోని ఐకానిక్ రెడ్ ఫోర్ట్ లేదా లాల్ ఖిలా ఉన్నాయి.
మొత్తంమీద, ఈ కరెన్సీ నోట్లు కేవలం డబ్బు విలువను కలిగి ఉండటమే కాకుండా భారతదేశ సాంస్కృతిక, చారిత్రక వారసత్వానికి సంబంధించిన మనోహరమైన దృశ్యాన్ని కూడా అందిస్తాయి.
0 Comments:
Post a Comment