దోమల దాడి తట్టుకోలేకపోతున్నారా..? ఇది చేతికి తొడుక్కుంటే...
ఇది చూడటానికి ఫ్యాషన్ రిస్ట్‌బ్యాండ్‌లా కనిపిస్తుంది. దీనిని చేతికి తొడుక్కుంటే, దోమలు ఆమడదూరం పరారైపోతాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంజినీర్ కర్ట్ స్టోల్ రూపొందించిన ఈ పరికరాన్ని స్విస్ కంపెనీ 'నోపిక్స్‌గో' త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల చేయనుంది.
దోమల నుంచి రక్షణ కల్పించే ఈ హైటెక్ రిస్ట్‌బ్యాండ్, పరిసరాల్లో దోమలను గుర్తించగానే, విద్యుత్ తరంగాలను విడుదల చేస్తుంది. ఇందులోంచి వెలువడే విద్యుత్ తరంగాల తాకిడికి ఏదో తుఫాను ముంచుకొస్తున్నట్లుగా దోమలు గందరగోళంలో పడి, వెంటనే పారిపోతాయి. క్రౌడ్ ఫండింగ్ ద్వారా దీని ఉత్పత్తి ప్రారంభించాలని 'నోపిక్స్‌గో' భావిస్తోంది. దీని ధర 70 యూరోల (రూ.6,255) వరకు పెట్టవచ్చని అంచనా!
0 Comments:
Post a Comment