మూన్‌బిన్, కుడి నుంచి మొదట వ్యక్తి, బాయ్ బ్యాండ్ ఆస్ట్రో సభ్యుడు
కె-పాప్ స్టార్ మూన్‌బిన్ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ దిగ్భ్రాంతికి గురి చేసింది.
అంతేకాదు...పాపులర్ ఆర్టిస్టులు ఎదుర్కొనే ఒత్తిళ్లు అనే సమస్యను కూడా మరోసారి ముందుకు తెచ్చింది.
25 ఏళ్ల మూన్‌బిన్ ఆస్ట్రో బాయ్ బ్యాండ్‌లో సభ్యుడు. నటుడు, గాయకుడు, మోడల్ కూడా. తన తోటి సభ్యుడితో కలిసి వరల్డ్ టూర్ లో ఉన్న సమయంలోనే ఆయన మరణించారు.
మరణానికి ఖచ్చితమైన కారణం ఏంటో ఇంకా పరిశోధన జరుగుతున్నా, అతనిది ఆత్మహత్య కావచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు.
దక్షిణ కొరియా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో వరసగా జరుగుతున్న యంగ్ సెలబ్రిటీల మరణాలలో ఇది తాజా ఘటన.
జంగ్ చే-యుల్ అనే 26 ఏళ్ల నటి ఈ నెల ఆరంభంలో తన ఇంట్లో శవమై కనిపించింది. మరోనటి యు జూ-యున్ గత ఏడాది ఆగస్టులో మరణించారు. ఆమె వయసు 27 సంవత్సరాలు .
ఆన్‌లైన్ వేధింపుల కారణంగా 2019లో ఓ సెలబ్రిటీ యువకుడు మరణించగా, ఒక నెల తర్వాత అతని గర్ల్‌ఫ్రెండ్ గూ హరా కూడా శవమై కనిపించారు. ఆమె కూడా కె-పాప్ గ్రూప్ సభ్యురాలు.
అయితే, అవన్నీ ఆత్మహత్యలు కావు. మూన్‌బిన్ మరణం మాత్రం కొరియన్ షో బిజినెస్‌లో పోటీతత్వంపై మరోసారి అనుమానాలకు తావిచ్చింది.
కె-పాప్ స్టార్ కావడం అంత కష్టమా ?
దక్షిణ కొరియాలో పోటీ సంస్కృతి ఎక్కువ. ఈ కారణంగానే యువత ఎక్కువమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెబుతారు. మొత్తంగా ఆత్మహత్యల రేటు తగ్గుతున్నా, 20 ఏళ్లలోపు యువకుల మరణాల సంఖ్య మాత్రం ఇక్కడ పెరుగుతోంది.
దక్షిణ కొరియాలో సెలబ్రిటీ జీవితం చాలా ఒత్తిళ్లతో కూడుకుని ఉంటుందని బిల్‌బోర్డ్ మ్యాగజైన్‌కు ఆసియా కరస్పాండెంట్ రాబ్ స్క్వార్ట్జ్ అన్నారు.
ఉత్తర అమెరికా, యూరప్‌లోని పాప్ స్టార్‌లతో పోలిస్తే ఇక్కడి పాప్ స్టార్లు ఎక్కువ ఒత్తిడికి గురుతుంటారని ఆయన చెప్పారు.
ఈ రంగంలో మొదటి నుంచి పోటీ తీవ్రంగా ఉంది. ఔత్సాహిక యువ కొరియన్లకు ఎంటర్‌టైన్‌మెంట్ రంగం అత్యంత పాపులర్ కెరీర్ ఆప్షన్.
2021లో దక్షిణ కొరియా విద్యా మంత్రిత్వ శాఖ చేసిన సర్వేలో యాక్టర్, మోడల్‌లు, సింగర్ లాంటివి ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్థుల టాప్ 10 డ్రీమ్ జాబ్‌లలో ఉన్నాయి.
కె-పాప్ స్టార్ కావడానికి చాలా తీవ్రమైన ట్రైనింగ్‌లో గడపాల్సి ఉంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులతో వారి సంబంధాలు దాదాపు తెగిపోతాయి. ఇలా చాలా సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది.
మూన్ బిన్ విషయంలో ఏం జరిగింది?
మూన్‌బిన్ విషయానికి వస్తే, 11 సంవత్సరాల వయస్సులో ఆసియా వ్యాప్తంగా ఫేమస్ అయిన కొరియన్ డ్రామా సిరీస్ బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్‌లో బాల నటుడి స్థాయి నుంచి వచ్చిన అతను, ఆస్ట్రో అనే ఫేమస్ గ్రూప్‌లో చేరడానికి 8 సంవత్సరాలు ట్రైనింగ్ పొందాల్సి వచ్చింది. అతని సోదరి మూన్ సువా గర్ల్ బ్యాండ్ బిల్లీ లో గాయనిగా 12 సంవత్సరాలకే ఫేమస్ అయ్యారు.
చాలా తీవ్రమైన పోటీ తర్వాత చాలా కొద్దిమంది మాత్రమే ట్రైనీలు మాత్రమే స్టేజ్ దాకా రాగలిగారు. ఇప్పటికే స్టార్లతో నిండిన షో ఇండస్ట్రీలో వారు పోటీ పడాల్సి ఉంటుంది.
సెలబ్రిటీ ఏజెన్సీలు, ఫ్యాన్స్ కల్చర్ అనేవి కొరియన్ స్టార్లపై ఒత్తిడి పెంచే ప్రధానమైన కారణాలని స్క్వార్ట్జ్ అన్నారు.
కెరీర్ ఆరంభంలో వారు బానిస ఒప్పందాలు(Slave Contracts) అని పిలుచుకునే ఒప్పందాలకు కట్టుబడాల్సి ఉంటుంది. ఇలాంటివి వారికి తమ షెడ్యూల్ మీద, ఆర్ధికపరమైన లాభాల మీద కంట్రోల్ లేకుండా చేస్తాయి.
ఇలాంటి ఒప్పందాలపై కేసులు వేసి గెలిచిన వారు కొందరు ఉన్నప్పటికీ, ఇలాంటి ఒప్పందాలు పూర్తిగా ఆగిపోలేదని, పూర్తి మార్పులు రాలేదని స్క్వార్జ్ అన్నారు.
" కొత్త ఒప్పందాలో కె-పాప్ స్టార్‌లకు ఎక్కువ నియంత్రణ ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ, వాస్తవంగా అలా ఉండదు'' అని స్క్వార్ట్జ్ చెప్పారు.
దేశంలోని అత్యంత చురుకుగా ఉండే సోషల్ మీడియా ద్వారా అభిమానులను విస్తరించుకోవడమేని ఒక్కోసారి రెండంచుల కత్తి కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
" సోషల్ మీడియాలో వారి ప్రతి కదలికపై శ్రద్ధ చూపుతారు. వారి ప్రతి వ్యవహారంపైనా వ్యాఖ్యలు చేస్తారు'' అని స్క్వార్ట్జ్ వివరించాడు.
" మైక్రోస్కోప్ కింద పరిశీలిస్తున్నట్లు ఉంటే, వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు'' అని ఆయన అన్నారు.
సెలబ్రిటీలుగా మారిన తర్వాత వారిని అభిమానులే కాదు, మొత్తం సమాజం నిశితంగా గమనిస్తుంది. అసమానతలు ఎక్కువగా ఉన్న ఈ దేశంలో సెలబ్రిటీగా ఉండటమంటే ప్రజలు కోరుకున్నట్లుగా ఉండటమేని స్క్వార్జ్ అభిప్రాయపడ్డారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం అనేది దక్షిణ కొరియాలో ఒక పబ్లిక్ ఫిగర్ చేసే అత్యంత ఘోరమైన నేరాలలో ఒకటిగా భావిస్తారు. దీంతో ఒక సెలబ్రిటీ కెరీర్ ముగిసిపోతుంది కూడా.
ప్రముఖ నటి కిమ్ సె-రాన్ మద్యం తాగి వాహనం నడుపుతూ యాక్సిడెంట్‌కు గురైన తర్వాత ఆమెపై చాలా విమర్శలు వచ్చాయి.
"ఇతర దేశాలతో పోలిస్తే కొరియా సెలబ్రిటీలకు చాలా కఠినమైన నైతిక ప్రమాణాలు ఉంటాయి'' అని కొరియన్ పాప్ సంస్కృతిపై విమర్శకుడై హా జే-కున్ అన్నారు.
"ఒక స్టార్ 'మర్యాద' తప్పి వ్యవహరిస్తే ప్రజలు వారిపై దాడి చేస్తారు. బలమైన సామూహికవాదం నుండి వచ్చే సామాజిక ఒత్తిడి కారణంగా ఈ రకమైన దాడిని ఎదుర్కోవడం ఒక స్టార్‌కు చాలా కష్టం" అని కున్ అభిప్రాయపడ్డారు.
మానసిక వేదన
మానసిక ఆరోగ్య సమస్యలతో సెలబ్రిటీగా ఉండటం చాలా కష్టమని ఈ పరిశ్రమలో ఉన్నవారు చెబుతారు.
ఇలాంటి వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని 2017లో బీబీసీ కొరియన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ర్యాప్ స్టార్ స్వింగ్స్ చెప్పారు. ఆయన కూడా మల్టిపుల్ మెంటల్ డిజార్డర్ సమస్యతో బాధపడ్డారు.
''నగ్నంగా తిరుగుతున్నట్లుగా ఉంటుంది'' అని ఆయన అన్నారు.
మానసిక ఒత్తిడి నుంచి తప్పించుకోవడాడానికి కొందరు కె-పాప్ స్టార్లు లాంగ్ బ్రేక్స్ కూడా తీసుకున్న సందర్భాలున్నాయి.
టాప్ గర్ల్ గ్రూప్ సభ్యురాలైన జియోంగ్యోన్ మానసిక ఆరోగ్య సమస్యలు, మెడ గాయం కారణంగా 2020 నుండి నాలుగుసార్లు బ్రేక్ తీసుకున్నారు.
ఆమె గత నెలలో తిరిగి వచ్చారు. మూన్‌బిన్ ఆరోగ్య కారణాలను పేర్కొంటూ 2019, 2020లలో బ్రేక్ తీసుకున్నారు.
అనేక ఏజెన్సీలు ట్రైనీలు,సెలబ్రిటీల కోసం థెరపీ సెషన్‌లను కూడా ప్రారంభించాయి. దక్షిణ కొరియాలో అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ అయిన నావర్, అది ప్రచురించి ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కింద కామెంట్స్ సెక్షన్‌ను తీసేసింది. దీన్నిబట్టి అక్కడి వాతావరణం ఎంత దారుణంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు.
0 Comments:
Post a Comment