ఏపీలో ఉద్యోగులకు జగన్ గుడ్ న్యూస్- డీఎల విడుదల, బదిలీలపై కీలక హామీ...
ఏపీలో వైసీపీ సర్కార్ పై ఉద్యోగుల్లో అసంతృప్తి కనిపిస్తున్న వేళ.. ప్రభుత్వం వారిని బుజ్జగించే పనిలో పడినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వానికీ,ఉద్యోగులకూ మధ్య సంధాన కర్తగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డిని ఇవాళ పిలిపించుకుని మాట్లాడిన జగన్..
రెండు విషయాల్లో కీలక హామీలు ఇచ్చినట్లు సమాచారం. ఈ వివరాలను ఆయన పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరఫున ఉద్యోగుల సమస్యలను సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట రామిరెడ్డి తెలిపారు.
ఇందులో పెండింగ్ డీఏల విడుదలతో పాటు రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి అంశాలు కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. వీటిపై సీఎం జగన్ కీలక హామీలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో ఉద్యోగులకు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని కోరగా ఈ నెలలో డిఏ ఉత్తర్వులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట రామిరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సాధారణ బదిలీలకు అనుమతించాలని కోరగా మే నెలలో ఉద్యోగుల బదిలీలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారులను ఆదేశించారన్నారు.
మరోవైపు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా వచ్చే నెలలో జరిగే సాధారణ బదిలీలలో అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట రామిరెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే పలు అంశాల్లో ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్న వేళ.. ఇవాళ జగన్ ఇచ్చిన హామీలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
0 Comments:
Post a Comment