Aura Electric Scooter: నెలకు రూ.2 వేలు కడితే చాలు.. ఈ పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీదే!
Electric Vehicles | కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా?
అయితే మీకు శుభవార్త. అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది. అందుబాటు ధరలోనే సూపర్ ఫీచర్లతో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తోంది. దీన్ని మీరు తక్కువ ఈఎంఐతో కూడా కొనొచ్చు.
బెన్‌లింగ్ ఈవీ అనే కంపెనీ మార్కెట్‌లో పలు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తోంది. వీటిల్లో సూపర్ ఫీచర్లు ఉన్నాయి. రేంజ్ ఎక్కువగా ఉంటుంది. ధర కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం కంపెనీ అందిస్తున్న ఆరా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకుందాం.
ఆరా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో సూపర్ ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ ఇందులో బీఎల్‌డీసీ 250 వాట్ మోటార్‌ను అమర్చింది. 72వీ స్మార్ట్ కంట్రోలర్ ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ 72వీ 43 ఏహెచ్. లిథియం అయాన్ బ్యాటరీ అమర్చింది. ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ ఉంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ కేవలం 4 గంటల్లోనే ఫుల్ అవుతుంది. ఇకపోత ఆరా ఎలక్ట్రిక్ స్కూటర్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లుగా ఉ:టుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే ఈ స్కూటర్ ఎకో మోడ్‌లో 120 కి.మి వరకు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది.
ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ 165 ఎంఎంగా ఉంది. అలాగే ఇందులో యూఎస్‌బీ పోర్ట్ ఉంటుంది. దీని ద్వారా మొబైల్ ఫోన్‌కు చార్జింగ్ పెట్టుకోవచ్చు. యాంటీ థెప్ట్ ప్రొటెక్షన్ అలారం ఉంటుంది. స్మార్ట్ బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్ లభిస్తుంది.
అలాగే లో, ఎకో, స్పోర్ట్స్, టర్బో స్పీడ్ అనే రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఇంకా ఈ స్కూటర్‌లో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇంటెలిజెంట్ స్పీడో మీటర్ కన్సోల్ లభిస్తుంది.
ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు రంగుల్లో లభిస్తుంది. బ్లాక్, పర్పూల్, బ్లూ రంగుల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తోంది. ఇంకా ఇందులో డీటాచబుల్ బ్యాటరీ ఉంటాయి. మూవబుల్ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. యూఎస్‌బీ పోర్ట్, స్టార్ట్ స్టాప్ బటన్ ఉంటుంది. డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి.
కీలెస్ ఎంట్రీ ఉంటుంది. పార్కింగ్ అసిస్టెన్స్ ఉంది. టెలీస్కోపిక్ సన్సెన్షన్ ఉంటుంది. బ్యూటిఫుల్ టెయిల్ ల్యాంప్ ఉంటుంది. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారు దగ్గరిలోని షోరూమ్ వెళ్లి నచ్చిన మోడల్ కొనొచ్చు.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర దాదాపు రూ. 92 వేలుగా ఉంది. మీరు ఒకేసారి ఇంత మొత్తం పెట్టలేమని భావిస్తే.. లోన్ తీసుకొని స్కూటర్ కొనొచ్చు. లోన్ ఈఎంఐ రూ. 2 వేల నుంచి ప్రారంభం అవుతుంది. మీరు డౌన్ పేమెంట్ రూ.10 వేలు కట్టారని అనుకుందాం.
ఇప్పుడు 9 శాతం వడ్డీ రేటుతో లోన్ తీసుకుంటే.. 48 నెలల టెన్యూర్ పెట్టుకుంటే.. నెలకు రూ. 2 వేల ఈఎంఐ పడుతుంది. మీరు రూ. 82 వేలకు లోన్ పొందాల్సి ఉంటుంది. వడ్డీ రేటు మారే కొద్ది ఈఎంఐ కూడా పెరుగుతుంది.
This very good bike for students and services and also save daily fuel.Good for daily use.
ReplyDeletethnak you for sharing this information