ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రముఖ అమరరాజా సంస్థలో ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ద్వారా ప్రకటన విడుదలైంది.
ఈ ప్రకటన ద్వారా మొత్తం 60 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నారు. అప్రంటీస్ ట్రైనీ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకోవడానికి ఏప్రిల్ 15 లాస్ట్ డేట్.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
- టెన్త్ పాసైన వారి కోసం 30 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి మొదటి మూడు నెలలు రూ.7500, తర్వాత 9 నెలలు రూ.11,453, తర్వాత 12 నెలలు రూ.11,653 చొప్పున స్టైఫండ్ ఉంటుంది.
-ఇంటర్ చేసిన వారి కోసం మరో 30 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి మొదటి 3 నెలల పాటు రూ.7500 చొప్పున, తర్వాత 9 నెలల పాటు రూ.11,653 చొప్పున, తర్వాత 12 నెలల పాటు రూ.11,853 చొప్పున స్టైఫండ్ ఉంటుంది.
Registration-LINK
ఇతర వివరాలు:
- హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
- అప్రంటీస్ షిప్ వ్యవధి: 24 నెలలు
- జాబ్ లొకేషన్: అమర రాజా గ్రూప్, చిత్తూరు
- ఇతర బెనిఫిట్స్: ఫుడ్, వసతి సదుపాయం ఉంటుంది.
- కావాల్సిన సర్టిఫికేట్లు: టెన్త్ మార్క్స్ షీట్, ఆధార్ కార్డు, 4 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు
- అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9505601887, 9100477371 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment