Anti sleep alarm: డ్రైవింగ్ చేసేప్పుడు ఇకపై నిద్ర రాదూ.. ఈ స్టూడెంట్ ఐడియా అదుర్స్..
డ్రైవర్లు నిద్రమత్తులోకి జారుకోవడంతో దేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరగుతున్నాయి. ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు.
మారుతున్న టెక్నాలజీ చాలా రంగాల్లో అధునాతన పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా నిద్రలోకి జారుకుంటే అలర్ట్ చేసే పరికరాన్ని విద్యార్థులు తయారు చేశారు. ఇండోర్ కి చెందిన ఐదుగురు విద్యార్థులు యాంటీ స్లీప్ అలర్ట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. డ్రైవర్ నిద్రలోకి జారుకున్నప్పుడు ఇది శబ్దం చేయడం ద్వారా డ్రైవర్ ని అలెర్ట్ చేస్తుంది. దీంతో పాటు వాహనాన్ని ఏకకాలంలో నిలిపివేస్తుందని వారు తెలిపారు. దీనిపై ఇంకా ప్రయోగాలు జరుగుతున్నట్లు వారు చెప్పారు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.ఇది ఎలా పనిచేస్తుందంటే.. డ్రైవర్ కళ్లు మూసుకున్నప్పుడు ఈ పరికరంలోని సెన్సార్ అతడ్ని ఉత్తేజపరచేలా బజర్‌ను మోగిస్తుంది. బజర్ మోగిన తర్వాత కూడా డ్రైవర్ కళ్లు మూసుకుంటే కారు చక్రం కూడా ఆగిపోయే టెక్నాలజీని తయారు చేశారు. ఈ పరికరంతో పెద్ద వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికుల ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ఈ స్లీప్-యాంటీ అలారంను రూపొందించడానికి ఐదుగురు విద్యార్థులు దాదాపు మూడు వారాలు పనిచేశారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ సీట్ లోని వ్యక్తి స్టీరింగ్‌పై నిద్రిస్తున్నట్లు తెలిసింది. దీంతో ట్రక్కు, బస్సు డ్రైవర్ల కోసం అలారం వ్యవస్థను రూపొందించాలని నిశ్చయించినట్లు విద్యార్థి ఒకరు చెప్పారు.
0 Comments:
Post a Comment