Anjana Devi: టాలీవుడ్ మెగాస్టార్ హీరో చిరంజీవి అంటే ఇష్టముండని వారుండరు. ఆయన సినిమాలను ఇప్పటికీ ఆదరిస్తారు. అందుకే నేటి డైరెక్టర్లు విభిన్న కథలతో చిరంజీవితో సినిమాలు తీస్తున్నారు.
చిరంజీవితో పాటు ఆయన ఫ్యామిలీలో నుంచి ఇండస్ట్రీకి వచ్చిన పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ లాంటి వాళ్లకు విపరీత ఫ్యాన్స్ ఉన్నారు. మెగా ఫ్యామిలీకి చెందిన వారు ఎంత పెద్ద స్టార్లు అయినా చిరంజీవి అంటే అభిమానమే.
కానీ ఆయన తల్లి అంజనా దేవి గారికి మాత్రం సినిమా హీరోల్లో వీరెవరు ఇష్టం లేదట. ఆమెకు నచ్చిన ఓస్టార్ హీరో మరొకరు ఉన్నారట. ఆయన సినిమాలను అంజనాదేవి గారు తప్పకుండా చూసేవారట. మరి ఆ స్టార్ హీరో ఎవరు?
చిత్ర సీమకు మెగా హీరోలను అందించిన అంజనాదేవి గారి గురించి సినీ ప్రేక్షకులందరికీ తెలుసు. పలు కార్యక్రమాలు, సందర్భాల్లో మెగా హీరోలు అంజనా గురించి చెబుతూ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి అమ్మపై ఎంత ప్రేమ ఉంటుంటో కన్నీళ్ల ద్వారానే చెబుతారు.
పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల్లో వీరంతా ఒక్కచోటుకు చేరి అంజనా దేవి చేసిన వంటనే ఆరగిస్తారట. ఆమెను ప్రత్యేకంగా గౌరవించి ఆ రోజంతా సంతోషంగా గడుపుతారట. ఇక అంజనా దేవి గారు సైతం సమయం దొరికినప్పుడల్లా నాగబాబు, పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్తూ ఉంటారట.
Anjana Devi
తాజాగా ఈమె గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇండస్ట్రీలో ఓ హీరో సినిమాలు అంటే ఆమెకు విపరీతమైన అభిమానమ. ఆయన ఎవరో కాదు. అక్కినేని నాగేశ్వర్ రావు. నాగేశ్వర్ రావుకు లేడీ ఫ్యాన్స్ చాలా మంది ఉండేవారు. అందులో అంజనాదేవి ఒకరు.
నాగేశ్వర్ రావు స్ఫూర్తితోనే చిరంజీవి సినిమాల్లోకి వచ్చారని చెప్పుకుంటారు. ఆయన సినిమాలో ఒక్కటి కూడా వదిలి పెట్టకుండా అంజనాదేవీ గారూ చూస్తుంటారట.
నాగేశ్వర్ రావు, చిరంజీవి కలిసి 'మెకానిక్ అల్లుడు' అనే సినిమాల్లో కనిపించిన విషయం తెలిసిందే. ఇందులో వీరిద్దరు సొంత మామ అల్లుళ్లులా తమ పాత్రలో జీవించారు.
అయితే అంతకుముందు తల్లి అంజనా దేవి నాగేశ్వర్ రావు గురించి చెబుతుండడంతో ఆ విషయాన్ని స్టార్ హీరోకు చెప్పారట. ఆ తరువాత అంజనాదేవిని నాగేశ్వర్ రావు గారికి చిరంజీవి పరిచయం చేశారట.
సినిమాల్లో చూసిన నాగేశ్వర్ రావును రియల్ గా కలుసుకుంటానని అస్సలు ఊహించలేదని ఆమె చెప్పేవారట.
0 Comments:
Post a Comment