Air Conditioner: పోలా.. అదిరిపోలా.. ఈ ఏసీని 365 రోజులు వాడినా.. జీరో కరెంట్ బిల్.. ప్రతినెలా రూ.2000లకు పైగా ఆదా..!
Solar Ac: వేసవిలో ఏసీ గాలిని ఆస్వాదించాలంటే జేబులపై భారం పడే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో, వేసవిలో ఏసీల వాడంక వల్ల వచ్చే కరెంటు బిల్లుల టెన్షన్ నుంచి బయటపడాలనుకుంటే, మీ ఇల్లు సిమ్లా వలె చల్లగా ఉండాలని ఆశపడితే..
ఈ AC గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ఈ ఏసీ చల్లటి గాలిని అందిస్తుంది. కానీ, కరెంటు బిల్లు ఏమాత్రం రాదు. ఈ AC కోసం మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఒక్కసారి రూ.30 వేలు ఖర్చు చేస్తే చాలు.. హాయిగా వాడుకోవచ్చు.
మీరు ఈ ACని కొనుగోలు చేయాలనుకుంటే, ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదు. ఇంటి వద్ద కూర్చొనే ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఇండియా మార్ట్ నుంచి ఆర్డర్ చేయవచ్చు. ఈ ACని సరసమైన ధరలో కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతారు.
ఇది భారతదేశంలో తయారు చేయబడిన సోలార్ AC. దీనిలో 240V వోల్టేజ్ అందుబాటులో ఉంటుంది. దీని బాడీ ప్లాస్టిక్/ఫైబర్‌తో తయారు చేశారు. ఇది 35 కిలోల బరువు ఉంటుంది. దాని కెపాసిటీ గురించి చెప్పాలంటే, దీనిని 1.5 టన్ను కెపాసిటీలో పొందవచ్చు. కస్టమర్ల సౌలభ్యం కోసం, దానిపై ఒక సంవత్సరం వారంటీ కూడా అందుబాటులో ఉంది. ఈ AC ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఇండియా మార్ట్‌లో కేవలం రూ. 30,000కే లభిస్తుంది.
సాధారణ ఏసీ లానే పని..
ఈ సోలార్ ఏసీ గురించి మాట్లాడితే, సాధారణ ఏసీతో పోలిస్తే సోలార్ ఏసీ మీకు ప్రతి నెలా 600 యూనిట్ల విద్యుత్తును ఆదా చేస్తుంది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో మీ కరెంటు బిల్లు రూ.5,000 నుంచి రూ.6,000కి తగ్గించుకోవచ్చు. సాధారణ ఏసీతో పోలిస్తే సోలార్ ఏసీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
0 Comments:
Post a Comment