Aadhaar Update: ఆధార్ కార్డు ఉన్న వారికి భారీ షాక్.. ఇక ఈ వివరాలు మార్చుకోవడం కష్టమే, కొత్త రూల్స్!
Aadhaar Card Update | ఆధార్ కార్డుదారులకు ముఖ్యమైన అలర్ట్.
ఆధార్ కార్డులో వివరాలు అప్‌డేట్ చేసుకోవాలని భావించే వారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇకపై ఆధార్ వివరాల అప్‌డేట్ అనేది కష్టతరం కానుంది.
యూఐడీఏఐ ప్రకారం చూస్తే.. ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను అప్‌డేట్ చేసుకోవడం కష్టతరం కానుంది. ఈజీగా ఈ వివరాలను అప్‌డేట్ చేసుకోవడం కుదరదు. ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా చూసుకోవడానికి యూఐడీఏఐ కొన్ని మార్పులు చేసింది.
జనవరి 25న యూఐడీఏఐ కొత్త ఆర్డర్‌ను జారీ చేసింది. ఆధార్ అప్‌డేట్‌కు సంబంధించి కీలక విషయాలు వెల్లడించింది. ఆధార్ కార్డు అప్‌డేట్‌కు కావాల్సిన డాక్యుమెంట్లకు సంబంధించి ఇందులో పలు అంశాలను పేర్కొంది.
ఆధార్ సాఫ్ట్‌వేర్ ఇప్పటి వరకు కొత్త రూల్స్‌కు అనుగుణంగా అప్‌డేట్ కాలేదు. అయితే ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆధార్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయ్యింది. దీని ద్వారా చాలా మందిపై ప్రతికూల ప్రభావం పడొచ్చు.
ఆధార్ అప్‌డేట్‌కు ఏ ఏ డాక్యుమెంట్లు కావాలో యూఐడీఏఐ వెల్లడించింది. పేరు, పుట్టిన తేదీ వంటి వాటిని మార్చుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్ల సంఖ్యను యూఏడీఏఐ తగ్గించేసింది.
కేవలం ఆరు డాక్యుమెంట్ల ద్వారానే మీరు ఆధార్ కార్డులో పుట్టిన తేదీని మార్చుకోవడానికి వీలు ఉంటుంది. పాస్‌పోర్ట్, గవర్నమెంట్ ఎంప్లాయీ రికార్డ్, పెన్షన్ రికార్డ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్, ట్రాన్స్ జెండర్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ ద్వారా మాత్రమే పుట్టిన తదీ మార్చుకోవడం వీలవుతుంది.
ఆధార్ కార్డు ప్రముఖ్యత, ప్రాధాన్యతను గుర్తించుకొని యూఐడీఏఐ ఈ కొత్త మార్పులను తీసుకువచ్చింది. అందువల్ల ఇకపై ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ వంటివి మార్చుకోవాలని భావిస్తే.. కొత్త రూల్స్ తెలుసుకోండి.
కాగా ఆధార్ కార్డు కలిగిన వారు యూఐడీఏఐ ఎప్పటికప్పుడు కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. రోజులో ఎప్పుడైనా సరే 1947 నెంబర్‌కు కాల్ చేసి సర్వీసులు పొందొచ్చు. ఇది టోల్ ఫ్రీ నెంబర్.
అంతేకాకుండా యూఐడీఏఐ ఇటీవలనే మరో ఫెసిలిటీ కూడా అందుబాటులోకి తెచ్చింది. ఉచితంగానే ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకునే ఆప్షన్ తీసుకువచ్చింది. పదేళ్ల నుంచి ఆధార్ కార్డులో వివరాలు అప్‌డేట్ చేసుకోని వారు ఉంటే ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు.
అయితే ఈ బెనిఫిట్ అనేది కేవలం మూడు నెలల మాత్రమే అందుబాటులో ఉంటుంది. జూన్ 15 వరకు మీరు ఈ ఉచిత ఆధార్ కార్డు అప్‌డేట్ సేవలు పొందొచ్చు. తర్వాత మళ్లీ యథావిథిగానే చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment