ఆ వీధిలో మీరు అడుగుపెట్టారంటే 75 భాషలు వినిపిస్తాయి... ఎందుకో తెలుసా..
ఈ సువిశాల ప్రపంచం అనేక దేశాలు, ప్రాంతాలు, వివిధ భాషలకు నిలయం. ఇక్కడ ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కో భాష అనేది వినబడుతూ ఉంటుంది. ఇక నగర విస్తీర్ణం, ప్రాంతం బట్టి వినిపించే భాషలు పదుల సంఖ్యలో ఉంటాయి.
దానికి ఉదాహరణగా మన భారతదేశాన్ని తీసుకోవచ్చు. ఇక్కడ బహుభాషలు వినబడుతూ ఉంటాయి. అయితే అవి ఒక రాష్ట్రానికి పరిమితమై ఉంటాయి. కానీ ఒకే వీధిలో వివిధ భాషలు అంటే సాధారణ విషయం కాదు. పైగా 75 భాషలంటే మాటలా? కానీ ఆ వీధిలో మీకు 75 భాషలు వినబడతాయి.
అవును, బ్రిటన్( Britain )లోని ఒక చిన్న నగరంలో కొలువై ఉన్న ఆ వీథి బహుభాషా వైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తుంది. ఇంతటి భాషా వైవిధ్యమున్న వీథి ప్రపంచంలోని మరే నగరంలోనూ, పట్టణంలోనూ లేదంటే అతిశయోక్తి లేదేమో. ఆ విధి వీథి బ్రిటన్లోని గ్లూసెస్టర్( Gloucester city ) నగరంలో ఉంది. ఈ నగర జనాభా 1.32 లక్షలు కాగా ఈ నగరంలోని బార్టన్ స్ట్రీట్లో రకరకాల ఆర్థిక తరగతులకు చెందిన వారు, వివిధ దేశాల వారు నివాసం ఉంటుంటారు. ఈ వీథి సందుల్లో పేదలు ఉండే నివాసాలు ఎక్కువగా మనకు కనిపిస్తాయి. ఇక్కడ స్థానిక భాష అయినటువంటి ఇంగ్లిష్ ప్రజలతో పాటు తూర్పు యూరోప్లోని నానా దేశాల వారు, కరీబియన్ దీవుల(Caribbean islands ) నుంచి వలస వచ్చినవారు, అదేవిధంగా ఆఫ్రికాలోని పలు దేశాలకు చెందిన వారు, మన భారతీయులు కూడా అనేకమంది వుంటారు. ఇంకా ఈ వీథిలో పశ్చిమాసియా నుంచి వలస వచ్చిన ముస్లింలు అయితే పెద్ద సంఖ్యలోనే కనిపిస్తారు. ఇక్కడి వారు బయట ఇంగ్లిష్ మాట్లాడినా, ఇళ్లల్లో తమ తమ మాతృభాషల్లోనే మాట్లాడుకుంటారు. ఈ వీథిలో కనిపించే భాషావైవిధ్యం ఇంకెక్కడా కనిపించదని ఇక్కడి స్థానికులు గర్వంగా చెప్పుకుంటారు.
0 Comments:
Post a Comment