మంత్రి వస్తారని.. గంటన్నర ఎండలోనే..!2.30 నుంచి సాయంత్రం 4 వరకు రోడ్డుపైనే విద్యార్థులు..
గుర్ల, ఏప్రిల్ 25: విద్యాశాఖ మంత్రి మెప్పు కోసం ఉపాధ్యాయులు చేసిన నిర్వాకం విద్యార్థులను గంటన్నరపాటు ఎండలో మాడేలా చేసింది. విజయనగరం జిల్లా గుర్ల మండలం జమ్ము గ్రామంలో మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. జమ్ము గ్రామంలో సచివాలయం, ఆరోగ్య క్లినిక్ కేంద్రాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ప్రారంభించాల్సి ఉంది. అయితే ఆయనకు స్వాగతం పలికేందుకు స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధాయులు దాదాపు 50 విద్యార్థులను మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో రోడ్డుపై నిలబెట్టారు. మంత్రి రాగానే పూలు చల్లాలని చెప్పారు. విద్యార్థులు గంటన్నరపాటు ఎండలో నిల్చోలేక అల్లాడిపోయారు. ఎట్టకేలకు మంత్రి 4 గంటలకు గ్రామంలోకి అడుగుపెట్టగానే పూలు చల్లి స్వాగతం పలికారు.
0 Comments:
Post a Comment