హైదరాబాద్ : నిజమైన దేశభక్తి అంటే ఏంటో నిరూపించిన మహా వీరుడు ఉద్ధం సింగ్. జలియన్ వాలాబాగ్ ఊచకోతలో వేల మంది అమాయకులను కాల్చి చంపిన జనరల్ డయ్యర్‌ను 21 ఏళ్ళ తర్వాత వాళ్ళ దేశం వెళ్ళి మరీ కాల్చి చంపాడు ఉద్ధం సింగ్.
1919, ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్‌లో సమావేశమైన ప్రజలకు మంచి నీళ్ళు ఇవ్వటానికి వాలెంటీర్‌గా వచ్చాడు.
తన కళ్ళ ముందే నిరాయుధులైన సాటి భారతీయులను చంపటం చూసి ఆ బాధలో 'ఇంత మంది భారతీయులను చంపిన డయ్యర్‌ను చంపకపోతే.. నేను భారతీయుడినే కాదు' అని శపథం చేసుకున్నాడు ఉద్ధం సింగ్.
గన్ షూటింగ్ లో ప్రత్యేక శిక్షణ.. డయ్యర్ ను కాల్చి చంపిన ఉద్దం సింగ్: ఆ తర్వాత.. గద్దర్ పార్టీలో చేరి అక్కడ గూఢచర్యం, గన్ షూటింగ్ నేర్చుకున్నాడు. ఈలోగా బ్రిటీష్ ప్రభుత్వం డయ్యర్‌ని బ్రిటన్ పంపేసింది.
అతన్ని చంపటం కోసం ఉద్ధం సింగ్ కూలీ పనుల నెపంతో జర్మనీ వెళ్లాడు. అక్కడి నుండి రహస్యంగా లండన్ చేరాడు. అక్కడ ఉంటూనే.. ఒక ప్రణాళికను రచించాడు. దాని ప్రకారం డయ్యర్ మార్చ్ 13న ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున మీటింగ్‌కు వెళ్తున్నాడని తెలుసుకుని.. అక్కడికి ముందుగానే చేరుకున్నాడు.
డయ్యర్ తనకు కనిపించగానే.. గన్‌తో కాల్చి చంపేసాడు. 'నా భారతీయుల ప్రాణాలకు నీకు ఇదే శిక్షరా.." అన్నాడు ఉద్దం సింగ్.
ఉద్ధం సింగ్‌కు ఉరి.. సంతోషంగా చచ్చిపోతానన్న ఉద్దం సింగ్:1940 జులై 31న ఉద్ధం సింగ్‌ను ఉరి తీసి చంపారు. ఆ శిక్ష విధించబోయే ముందు కోర్టులో "నేనే చేశాను ఈ హత్య. అతని మీద నాకు పగ. నేను అతనిని చంపేటంత తప్పు చేసాడు, నా దేశ ప్రజలను చంపాడు.
అందుకనే వాడిని చంపేసాను. అందుకోసం 21 సంవత్సరాలు వేచి చూసాను. నేను ఈ పని చేసినందుకు సంతోషంగా ఉన్నాను. నేను మరణ శిక్షకు భయపడటం లేదు. నేను నా దేశం కోసం మరణిస్తున్నాను.
అది నా బాధ్యత. నా మాతృభూమి కోసం మరణం కన్నా.. నాకు ఎక్కువ గౌరవం ఇవ్వబడుతుంది?" అన్నాడు ఉద్ధం సింగ్.
డయ్యర్‌ని వెతకటంలో ఎన్నో సమస్యలు.. కేవలం నీళ్లు తాగి బతికిన ఉద్దం సింగ్:ఉద్ధం సింగ్ డయ్యర్‌ని వెతకటంలో భాగంగా కొన్ని రోజులు తిండి లేక కేవలం మంచి నీళ్ళు తాగి బతికాడు.
అతని పట్టుదల, త్యాగ నిరతి, సాహసం ఎంత గొప్పవో అర్ధం చేసుకోవటానికి మరో ఉదాహరణ ఈ సంఘటన.
భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా జలియన్ వాలాబాగ్ ఘటన స్ఫూర్తినిచ్చింది.
స్వాతంత్య్రోద్యమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ ప్రతీ భారతీయుడి నరాల్లో స్వతంత్ర్య కాంక్షను రగిల్చిన సంఘటనగా జలియన్ వాలాబాగ్ అంశం చరిత్రలో నిలిచిపోయింది.
0 Comments:
Post a Comment