YSR Aasara: ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్..ఆరోజు నుంచి ఖాతాల్లోకి డబ్బులు
ముఖ్యంగా నవరత్నాల పేరుతో ప్రతీ ఇంటికి ఏదో ఒక లబ్ది జరిగేలా చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రెండు విడతలుగా వైఎస్సార్ ఆసరా నిధులను అందజేసింది.
ఇక తాజాగా వైఎస్సార్ ఆసరా మూడో విడత నిధుల జమకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది.
ఈనెల 25న ఏలూరు జిల్లా దేందలూరులో ఈ డబ్బుల జమ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
ఏప్రిల్ 5 వరకు అన్ని నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ నగదు పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది.
మూడో విడత కింద 78.94 లక్షల మంది డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ.6419 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
కాగా ఇప్పటికే 2019 ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాలకు ఉన్న అప్పును చెల్లిస్తామని హామీ ఇచ్చింది.
ఈ మేరకు ఇప్పటికే 2 విడతల్లో రూ.12,758 కోట్లను అర్హుల ఖాతాల్లో జమ చేశారు.
0 Comments:
Post a Comment