ఉత్తర్ ప్రదేశ్ లో వరుసగా రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడం వెనుక ఉన్న కీలక కారణాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కూడా ఒకటి.
యూపీలో యోగీ సర్కార్ (Yogi Adityanath )రాకముందు క్రిమినల్స్ కు, గ్యాంగ్స్ స్టర్స్ కు, మాఫియాలకు అడ్డాగా ఉన్న యూపీలో ఎన్ కౌంటర్ల స్పీడ్ పెరిగింది.
అంతే క్రిమినల్స్ కనిపిస్తే చాలు మట్టుబెట్టడం మొదలుపెట్టారు. ఇలా గత ఆరేళ్లలో 10 వేలకు పైగా ఎన్ కౌంటర్లు చేసేశారు. ఇందులో 63 మంది కరడుగట్టిన నేరస్తుల్ని మట్టుబెట్టారు.
ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం గత ఆరేళ్లలో 10 వేలకు పైగా ఎన్ కౌంటర్లు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇందులో ఓ పోలీసు సహా 63 మంది క్రిమినల్స్ చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఎన్‌కౌంటర్‌ల సంఖ్య పరంగా చూస్తే .. 2017 నుండి అత్యధికంగా 3152 ఎన్‌కౌంటర్‌లతో రాష్ట్రంలో మీరట్ అగ్రస్థానంలో ఉంది. ఇందులో 63 మంది నేరస్థులు చనిపోయారు.
అలాగే 1708 మంది నేరస్థులు గాయపడ్డారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో ఎన్‌కౌంటర్లలో 401 మంది పోలీసులు గాయపడగా, ఓ పోలీసు వీరమరణం పొందాడు. యూపీ పోలీసుల ఎన్ కౌంటర్లలో మొత్తం 5,967 మంది నేరస్థులు పట్టుబడ్డారని తేలింది.
2017 నుంచి చూస్తే యూపీ పోలీసులు మొత్తం 10713 ఎన్ కౌంటర్లు నిర్వహించారు.
ఇందులో మీరట్ 3152 ఎన్ కౌంటర్లలో టాప్ లో నిలవగా.. ఆ తర్వాత స్ధానంలో ఆగ్రా 1844 ఎన్ కౌంటర్లు, బరేలీలో 1497 ఎన్‌కౌంటర్లతో రెండు,మూడో స్ధానాల్లో నిలిచాయి.
వీటిలో 4654 మంది నేరస్థులను అరెస్టు చేశారు. 14 మంది కరడుగట్టిన నేరస్థులు చనిపోయారని, 55 మంది పోలీసులు గాయపడ్డారని ప్రభుత్వం ప్రకటించింది.
0 Comments:
Post a Comment