Yawns: ఎదుటివారు ఆవలిస్తే మనకు ఎందుకు ఆవలింపులు వస్తాయో తెలుసా?
సాధారణంగా ఆవలింతలు వస్తున్నాయి అంటే నిద్ర వస్తుందని అర్థం. ఒకవేళ నిద్ర పోయినా కూడా అలాగే పదేపదే ఆవలింతలు వస్తూ ఉంటే నిద్ర సరిపోలేదని మెదడు సంకేతం పంపిస్తూ ఉంటుంది.
అయితే చాలా సందర్భాలలో మనం ఒక విషయాన్ని గమనించి ఉంటాం.. అదేమిటంటే ఎదుటి వ్యక్తులు ఆవలించినప్పుడు అనుకోకుండా మనకు కూడా ఆవలింతలు వస్తూ ఉంటాయి. అయితే అందుకు గల కారణం ఏంటి అన్నది చాలా మందికి తెలియదు. కానీ ఎదుటి వ్యక్తి ఆవలించినప్పుడు మనకు కూడా ఆవలింతలు రావడానికి కొంతమంది ఏవేవో పిచ్చిపిచ్చి కారణాలు చెబుతూ ఉంటారు.
అలా రావడం వెనుక సైన్స్ దాగి ఉంది అంటున్నారు నిపుణులు. ఆ వివరాల్లోకి వెళితే.. నిజానికి మెదడు తనను తాను చల్లగా ఉంచేందుకు ఆవలింతలు వచ్చేలా చేస్తుంది. బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అలాగే చలికాలంలో బయట చల్లగా ఉంటే మన శరీరం వెచ్చగా మారుతుంది. అయితే వాతావరణానికి ఆవలింతకు సంబంధం ఉంది అంటున్నారు నిపుణులు. ఇదే విషయంపై గతంలో ఒక అధ్యయనం జరగా.. అందులో ఎండకాలంలో కంటే చలికాలంలోనే ఎక్కువ మంది ఆవలిస్తున్నారని తేలింది.
ఇకపోతే మనకు ఎదురుగా కూర్చున్న వ్యక్తులు లేదా నిలబడిన వ్యక్తులు ఒక్కోసారి ఆవలిస్తుంటారు. అప్పుడు వారిని చూస్తే మనకు కూడా ఆవలింత వస్తుంది. ఇది అందరికి తెలిసిన వాస్తవమే. ఈ విషయం గురించి దాదాపుగా 300 మందిపై అధ్యయనం జరుపగా.. ఒకరు ఆవలించడం చూసి మనకు కూడా ఆవలింత వస్తే మిర్రర్ న్యూరాన్ వ్యవస్థ యాక్టివేట్ అవ్వడం వల్లే జరుగుతుంది అని తెలిపారు నిపుణులు. కాగా అది నేరుగా మానవ మెదడుతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది. ఈ న్యూరాన్ వ్యవస్థ యాక్టివేట్ అయితే అది ఇతరులను ఫాలో అవ్వాలని ప్రేరేపిస్తుంది.
0 Comments:
Post a Comment