Weight Loss Diet: స్పీడ్ గా బరువు, కొవ్వు కరిగించాలంటే ఇవి చాలు, 8 రోజుల్లో మీరు అనుకున్న షేప్ తెచ్చుకోవడం ఖాయం!
Weight Loss Diet: బరువు పెరగడం ఎంత కష్టమో శరీర బరువును కూడా తగ్గించుకోవడం అంత కష్టమని అందరికీ తెలిసిందే. అయితే చాలా మంది బరువు తగ్గడానికి చాలా రకాల ప్రయత్నాలు చేసిన తగ్గించుకోలేకపోతున్నారు.
అయితే ఇలాంటి సమస్యల రావడానికి ప్రధాన కారణాలు ఆధునిక జీవనశైలిలో భాగంగా అతిగా అనారోగ్యకరమైన ఆహారాలు తినడమేనని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఎలాంటి వ్యాయామాలు చేయకుండా బరువు తగ్గడానికి చాలా రకాల చిట్కాలున్నాయి. వాటిని ప్రతి రోజూ పాటించడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి చిట్కాలను పాటించడం వల్ల సులభంగా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఊబకాయం వ్యాధులు?
ఊబకాయం వల్ల చాలా మందిలో స్థూలకాయం క్యాన్సర్, సంతానోత్పత్తి, గుండె, ఆస్టియో ఆర్థరైటిస్, టైప్ 2 మధుమేహం వంటి తీవ్ర సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా చాలా మందిలో కొలొరెక్టల్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి ప్రమాదం వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఎంత తొందరగా ఊబకాయాన్ని నియంత్రించుకుంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ఊబకాయం నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
బెల్లీఫ్యాట్‌ను కూడా తగ్గిస్తాయి:
తులసి గింజలు:
తులసి గింజల నీరు కూడా శరీరానికి చాలా మంచిది ఇందులో ఉండే ఉండే ఔషధ గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తులసి గింజల్లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ కె, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లభించడం వల్ల వీటిని బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడేవారు వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తప్పకుండా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తులసి గింజలను తీసుకోవాల్సి ఉంటుంది.
మజ్జిగతో బరువు తగ్గడం సులభమే:
బెల్లీ ఫ్యాట్‌ని సులభంగా తగ్గించుకోవాలనుకునేవారు తప్పకుండా బరువు తగ్గించే డైట్‌లో మజ్జిగను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు పొట్ట సంబంధిత సమస్యలకు దివ్యౌషధంగా పని చేస్తుంది. ఇందులో తక్కువ కేలరీలు లభిస్తాయి. కాబట్టి జీర్ణక్రియ సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా సులభంగా పొట్ట చుట్టు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
నిమ్మకాయ రసం:
ఖాళీ కడుపుతో నిమ్మరం తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే.. అయితే ప్రతి రోజూ ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ ఈ డ్రింక్‌ను తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గి బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
0 Comments:
Post a Comment