💥వెబెక్స్ ముఖ్యాంశాలు💥
👉రేపు అనగా తేదీ 04.03.23 న అన్ని పాఠశాలలలో స్కూల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంశముపై కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఫోటోలను వాట్సాప్ గ్రూప్ నందు షేర్ చేయాలి.
👉ఈ నెల 11 వ తేదీన అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలి. ఫోటోలను వాట్సాప్ గ్రూప్ నందు షేర్ చేయాలి.
👉ఎస్ సి ఈ ఆర్ టి వారి ద్వారా విడుదల చేయబడిన ప్రత్యేక టైం టేబుల్ ను అన్ని పాఠశాలలు విధిగా అమలు చేయాలి.
👉విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడానికి మేమే కారణం అని ఎలా చెప్పుకుంటామో, అదేవిధంగా కొంతమంది విద్యార్థులు అత్యల్ప మార్కులు పొందటానికి కూడా మీరే కారణం అనే విషయాన్ని అంగీకరించాలి.
👉విద్యార్థులలో పరీక్షలంటే ఉండే భయాన్ని పోగొట్టాలి.
👉పదవ తరగతి విద్యార్థులను గ్రూపులుగా విభజించాలి. ప్రతి ఉపాధ్యాయునికి కొంత మంది విద్యార్థులను దత్తత ఇవ్వాలి.
👉ప్రతి విద్యార్థి ఉతీర్ణత సాధించే విధంగా తర్ఫీదు ఇవ్వాలి.
👉వీలైనన్ని మాక్ టెస్టులు నిర్వహించాలి. విద్యార్థులు వ్రాసిన జవాబులను విశ్లేషించి, తప్పొప్పులను గుర్తించాలి. సవరణాత్మక బోధన చేయాలి.
👉పరీక్ష పూర్తైన రోజే దిద్దిన పేపర్లను విద్యార్థులకు ఇవ్వడానికి కృషి చేయాలి.
👉గత సంవత్సరం పదవ తరగతి వార్షిక పరీక్షలకు పంపిన రెండవ సెట్ ప్రశ్నా పత్రాలను పోలీస్ స్టేషన్ల నుండి తీసుకుని అన్ని పాఠశాలకు వెంటనే అందివ్వాలి.
👉ప్రీ పబ్లిక్ పరీక్షలతో పాటు, రెండవ సెట్ ప్రశ్నా పత్రాలతో మరొక మాక్ టెస్టును నిర్వహించాలి.
👉విద్యార్థుల గృహాలను సందర్శించాలి. తల్లిదండ్రులతో విద్యార్థుల ప్రగతి పై చర్చించాలి.
👉ప్రతి విద్యార్థి, ప్రతి రోజు పాఠశాలకు హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలి.
👉త్వరగా నిద్ర పోయి, వేకువ జామున నిద్ర లేచి చదువుకునే అలవాటును పెంపొందించాలి.
👉కొంత సమయాన్ని యోగ, మెడిటేషన్, ఆటలకు కేటాయించేటట్లు చూడాలి.
👉ఉదయం సాయంత్రం సమయాలలో అల్పాహారం అందించడానికి ప్రయత్నం చేయాలి
👉నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ప్రత్యేక తరగతులు నిర్వహించాలి.
👉గత మూడు సంవత్సరాల పదవ తరగతి పరీక్షా ఫలితాలను విశ్లేషించి, ఈ సంవత్సరం ఇంకా ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేయాలి.
👉విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
👉ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు సమయంలో పదవ తరగతి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి.
👉పదవ తరగతి పరీక్షా కేంద్రాలలో పూర్తి స్థాయిలో ఫర్నిచర్, ఎలక్ట్రిఫికేషన్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ ఫెసిలిటీస్ ఉండాలి. ఏ విద్యార్థి నేలపై కూర్చుని పరీక్షలు వ్రాయడానికి వీలులేదు.
♟️DEO-PRAKASAM♟️
0 Comments:
Post a Comment