Weak Immune System: శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలహీనత కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా దీని కారణంగా శరీరం బలహీనంగా మారుతుంది.
అయితే రోగనిరోధక వ్యవస్థ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాంతకంగానూ మారే ఛాన్స్ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ సమస్యతో బాధపడేవారు తప్పకుండా పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు అతిగా తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో రోగనిరోధక వ్యవస్థ బలహీనత కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయి. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కంటి చూపు లోపం:
రోగనిరోధక వ్యవస్థ లోపం వల్ల పొడి కళ్ళ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. దీని కారణంగా కళ్లలోకి ఇసుక చేరినట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా కొందరిలో కంటి చూపులు మార్పులు సంభవించి కంటి నుంచి నీరు కూడా వస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
డిప్రెషన్:
రోగనిరోధక శక్తి బలహీనత వల్ల డిప్రెషన్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లోపం కారణంగా మెదడులో కణాలు సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదలలో తీవ్ర మార్పులు సంభవించి మానసిక సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
స్కిన్‌పై దద్దుర్లు:
చర్మంపై తరచుగా దద్దుర్ల సమస్యలు వస్తే రోగనిరోధక శక్తి లోపమెనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్య కారణంగా సోరియాసిస్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి.
కాబట్టి ఈ లోపం నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
కడుపు సంబంధిత సమస్యలు:
పొట్ట సమస్యలు అనారోగ్యకరమైన ఆహారాలు తరచుగా తీసుకోవడం వల్ల కూడా వస్తాయి. అయితే రోగనిరోధక వ్యవస్థ లోపం వల్ల కూడా పొట్ట సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్యల కారణంగా గ్యాస్, అపానవాయువు వంటి తీవ్ర సమస్యలు వస్తాయి.
0 Comments:
Post a Comment